Site icon NTV Telugu

LEO Twitter Review: దళపతి విజయ్‌ ‘లియో’ ట్విటర్‌ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?

Leo Film Twitter Review

Leo Film Twitter Review

Thalapathy Vijay and Lokesh Kanagaraj’s LEO Movie Twitter Review: దళపతి విజయ్‌ హీరోగా, లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లియో’. విజయ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌.. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ లాంటి బ్లాక్‌ బస్టర్స్‌ అందించిన లోకేష్‌ డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ఆ అంచనాలను రెట్టింపు చేసింది. ఈ సినిమా విడుదల కోసం తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య లియో సినిమా నేడు (అక్టోబర్‌ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు మన దగ్గర పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. లియోకి ట్విటర్‌లో మంచి స్పందనే వస్తోంది. విజయ్‌ ఖాతాలో మరో హిట్‌ పడిందని చాలా మంది ఫాన్స్ కామెంట్‌ చేస్తున్నారు. ‘ఫస్టాఫ్‌ డీసెంట్‌. చాక్లెట్‌ కాఫీ సీన్‌ అదిరిపోయింది. సెకండాఫ్‌ యావరేజ్‌. సంజయ్‌ దత్‌, అర్జున్‌లను డైరెక్టర్ లోకేష్‌ సరిగా వాడుకోలేకపోయాడు. అనిరుధ్‌ సంగీతం బాగుంది’ అని ఒకరు కామెంట్ చేశారు.

Also Read: Navaratri : పెద్దమ్మ తల్లి గుడిలో శ్రీ లలితాదేవి అలంకరణలో అమ్మవారు..

‘దళపతి విజయ్‌ ఉత్తమ చలనచిత్రాలలో ఇది ఒకటి. విజయ్‌ స్వాగ్ మరియు స్టైల్ చాలా బాగుంది’, ‘లియో సినిమా బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ హిట్. రికార్డులు అన్ని బద్దలు అవుతాయి’, ‘విజయ్‌ మరింత స్టైలీష్‌గా ఉన్నాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌ అదుర్స్. స్టోరీ లైన్‌, ఎమోషనల్‌ సీన్స్‌ అద్భుతంగా పండాయి’,’లోకేష్‌ కనగరాజ్‌ గత సినిమాల మాదిరిగానే లియో స్టైలీష్‌గా ఉంది’ అని ఫాన్స్ ట్వీట్ చేశారు.

Exit mobile version