సూపర్‌స్టార్ రజనీకాంత్ నేటితో 73 వ వసంతంలోకి అడుగుపెట్టారు తన 73 వ పుట్టినరోజును ఎంతో సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు.తలైవా తన కుటుంబసభ్యుల సమక్షంలోనే పుట్టినరోజు వేడుకల్ని జరుపుకున్నారు. ఎలాంటి ఆడంబరాలు, హంగులు లేకుండా ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే కేక్ కట్ చేశారు. రజనీకాంత్ పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో ఆయన కూతుళ్లు, మనవళ్లతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.రజనీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోన్నాయి. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాదికి చెందిన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.ఈ ఏడాది జైలర్ సినిమా తో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు తలైవా రజనీకాంత్. నెల్సన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ భారీగా కలెక్షన్స్ ను రాబట్టింది.
అప్పటి వరకు ప్లాప్స్ తో సతమతమవుతున్న రజనీకాంత్ జైలర్ సినిమా తో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. జైలర్ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి రజనీకాంత్ స్టైల్ అండ్ యాక్టింగ్, మరియు నెల్సన్ టేకింగ్, అలాగే అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కారణమని చెప్పాలి.జైలర్ సినిమా ఇచ్చిన జోష్ లో రజనీకాంత్ వరుస సినిమాలు లైన్ లో పెట్టారు.ప్రస్తుతం రజనీకాంత్ లాల్ సలాంతో పాటు జై భీమ్ దర్శకుడు టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా లో నటిస్తున్నారు.. లాల్ సలాం సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తోంది.లాల్ సలాం మూవీ లో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారు. మరోవైపు టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం లో రూపొందుతోన్న మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా లో రజనీకాంత్‌తో పాటు అమితాబ్‌బచ్చన్ కీలక పాత్ర పోషిస్తోన్నారు . వీరితో పాటు రానా, ఫహాద్ ఫాజిల్ మరియు మంజు వారియర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.