Site icon NTV Telugu

Lottery: లాటరీలో రూ.2.9 కోట్లు.. ఆ మహిళ చేసిన పనికి భర్త షాక్!

Lottery

Lottery

thailand mans wife marries another person after winning lottery : భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంతో అద్భుతమైనది. ఎన్ని కష్టాలొచ్చినా ఆ బంధం విడదీయలేనిది. కానీ కొన్నిసార్లు డబ్బు ఈ భావాలన్నింటినీ మారుస్తుంది. థాయ్‌లాండ్‌లో నివసిస్తున్న ఒక వ్యక్తికి ఇలాంటిదే జరిగింది. అతని 20 సంవత్సరాల వివాహం లాటరీ ద్వారా విచ్ఛిన్నమైంది. ఆ భార్యాభర్తలు 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు ఆడబిడ్డలకూ జన్మనిచ్చారు. చేసిన అప్పు తీర్చడానికి విదేశానికి వెళ్లి కష్టపడ్డారు. పిల్లలను చూడడానికి స్వదేశానికి వెళ్లిన భార్య భర్తను దారుణంగా మోసం చేసింది. లాటరీ గెలుచుకున్న ఆమె తన భర్తకు సంగతి చెప్పనేలేదు. అంతేకాకుండా మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని భర్తకు షాక్ ఇచ్చింది. స్వదేశానికి తిరిగి వచ్చిన భర్త తనకు న్యాయం కావాలని అంటున్నాడు. ఈ ఘటన థాయ్‌ల్యాండ్‌లో జరిగింది.

దాదాపు 20 ఏళ్ల క్రితం థాయ్‌లాండ్‌కి చెందిన నరిన్ అనే వ్యక్తి చైవాన్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు నరిన్ వయస్సు 47 సంవత్సరాలు, అతని భార్య వయస్సు 43 సంవత్సరాలు. భార్య ఇటీవలే రూ. 3 కోట్లకు పైగా విలువైన లాటరీని గెలుచుకుంది. లాటరీ తగిలిన విషయం తన కుమార్తెలు తండ్రి ముందు చెప్పే వరకు నరిన్ భార్య అతనికి చెప్పలేదు. భర్త ఫోన్ చేయగా., నేను నీతో ఉండాలనుకోవట్లేదు అని లాటరీ డబ్బు తన చేతికి వచ్చిన వెంటనే భర్తకు హ్యాండిచ్చి ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి పెళ్లి కూడా చేసుకుంది చైవాన్. తాము ఇప్పటికే చాలా ఏళ్లుగా విడివిడిగా జీవిస్తున్నామని భార్య చెబుతుండగా, పని నిమిత్తం తాము దక్షిణ కొరియాలో ఉంటున్నామని నరిన్ చెప్పారు.

Read Also: Nithin Gadkari: రూ. 10 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్స్

ఫిబ్రవరి 25న భార్య ఫోన్‌లో విడిపోయిందని, మార్చి 3న తిరిగి వచ్చేసరికి భార్య వేరే పెళ్లి చేసుకుని విడిగా జీవించడం ప్రారంభించిందని నరిన్ తెలిపాడు. అయితే . ప్రతినెలా భార్యకు డబ్బు పంపుతుండగా తన ఖాతాలో డబ్బు తక్కువగానే ఉందని నరిన్ చెప్పాడు, అయితే తన భార్య తన అదృష్టం గురించి గర్విస్తోందని చెప్పాడు. ప్రస్తుతం కోర్టు మెట్లెక్కిన నరిన్..లాటరీలో తన భార్య గెలుచుకున్న మొత్తంలో సగం ఇప్పించాలని కోరుతున్నాడు. కాగా, తాను అతనితో 9 ఏళ్ల క్రితమే బ్రేకప్ చేసుకున్నామని, లాటరీ గెలవకముందే తాము విడిపోయామని, అందుకే తన లవర్‌ను పెళ్లి చేసుకున్నట్టు చైవాన్ చెప్పారు. ఆ బ్రేకప్ గురించి తనకు తెలియదని నరిన్ అన్నాడు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version