TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC JAC: జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని రాత పూర్వకంగా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి చెప్పామని.. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ ఈదురు వెంకన్న అన్నారు.. నిన్న ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసినట్లు తాజాగా మీడియాతో వెల్లడించారు. వేం నరేందర్‌రెడ్డి విలీనం చేస్తామని చెప్పారని.. కార్మికులు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రభుత్వ వైఖరిపై స్పష్టత కరువైందని.. ఈనెల 31న ఆర్టీసీ డిపోల ముందు ఎర్ర బ్యాడ్జిలు ధరించి నిరసన చేపడతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వం విలీనం చేయలేము అని గతంలో ప్రభుత్వం చెప్పిందని.. ఈ మధ్య సమ్మె చేపట్టి ప్రభుత్వానికి కనువిప్పు చేశామని ఆర్టీసీ జేఏసీ వైస్ ఛైర్మెన్ థామస్ రెడ్డి తెలిపారు. “కార్మికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో నిన్న మంత్రి పొన్నం కొన్ని వ్యాఖ్యలు చేశారు.. గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తాం అని అంటే కథ మళ్ళీ మొదటికి తీసుకొచ్చే పని చేస్తున్నారు.. కానీ మేము ఎన్నికలు.. సంఘాలు కాదు కోరుకోనేది.. విలీనం కావాలని డిమాండ్ చేస్తున్నాం.. పొన్నం వ్యాఖ్యలతో కార్మికుల్లో విస్మయం కలిగిస్తుంది..
కార్మికుల కోసం తిరిగిన సంఘం మాది.. కొన్ని సంఘాలు మాటలు మార్చి కార్మికులను గందరగోళానికి గురి చేస్తున్నారు.. ప్రభుత్వం అపాయింటెడ్ డే ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం.. ఎన్నికలు అవసరం లేదు.. 2న ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం..” అని థామస్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read
- ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
- Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
- Indian Railways Food Prices: రైల్వే ప్రయాణికులకు షాక్.. వాటి ధరల పెంపు.! జూన్ 1 నుంచి అమల్లోకి..
- West Bengal: “10 నిమిషాల్లో భారత్‌లోకి వచ్చేశాం”.. ఆధార్, ఓటర్ ఐడీలు ఎలా వచ్చాయో చెప్పేసిన బంగ్లాదేశ్ వలసదారులు
తాజావార్తలు
-
Peddi Team Takes : ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీపై ‘పెద్ది’ టీమ్ లీగల్ యాక్షన్ స్టార్ట్
-
‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP).. కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ..!
-
Vaibhav vs Kohli: 2016లో విరాట్ కోహ్లీ, 2026లో వైభవ్ సూర్యవంశీ.. ఐపీఎల్ చరిత్రలోనే గొప్ప..!
-
Supreme Court: హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు.. ఆలస్యం వద్దు..!
-
TGSRTC JAC: ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై మళ్లీ ఉద్రిక్తత.. నిరసనలకు సిద్ధమైన జేఏసీ
ట్రెండింగ్
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..
-
AC Tips : ఏసీని పదేపదే ఆన్ చేసి ఆఫ్ చేస్తే ఏమవుతుంది.?
-
భారత్‌లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్‌తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!