తొలి మహిళా కండక్టర్లను టీజీఎస్ ఆర్టీసీ సన్మానించింది. ఆర్టీసీలో తొలి మహిళా కండక్టర్లుగా విధుల్లో చేరి 28 ఏళ్ల ఉత్తమ సర్వీసును పూర్తి చేసుకున్న ముగ్గురిని యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్‌లో దిల్‌సుఖ్‌నగర్ డిపోనకు చెందిన శ్రీదేవి, అనిత, మెహిదిపట్నం డిపోకు చెందిన శారదను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ సన్మానించారు. ఉన్నతాధికారులతో కలిసి వారికి ప్రశంశా పత్రాలు అందజేశారు. ఈ మేరకు ఎండీ వీసీ సజ్జనర్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పేర్కొన్నారు.
READ MORE: YS Jagan: నాగమల్లేశ్వరావు కుటుంబానికి జగన్ పరామర్శ.. రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఘటన..!
ఎన్నో ఏళ్లుగా ప్రజా రవాణా వ్యవస్థలో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తోన్న మహిళా కండక్టర్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్ టేకింగ్స్(ASRTU) అంతర్జాతీయ మహిళా దినత్సవం సందర్భంగా ఇటీవల న్యూఢిల్లీలో సత్కరించింది. అందులో టీజీఎస్ఆర్టీసీ నుంచి కండక్టర్లు శ్రీదేవి, అనిత, శారద ఉన్నారని సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీలో వారి సేవలను కొనియాడుతూ యాజమాన్యం సన్మానించిందని తెలిపారు. ఈ సన్మాన కార్యక్రమంలో సంస్థ ఈడీ మునిశేఖర్, సీపీఎం ఉషా దేవి, దిల్ సుఖ్ నగర్ డీఎం సమత, తదితరులు పాల్గొన్నారు.
READ MORE: Goa: పెళ్లి చేసుకొందామని గోవాకు తీసుకెళ్లి.. ప్రేయసిని చంపిన వ్యక్తి..
