NTV Telugu Site icon

Burra Venkatesham : “నేనున్నా.. ధైర్యంగా పరీక్షలు రాయండి” నిరుద్యోగులకు TGPSC ఛైర్మన్ హామీ

Tgpsc

Tgpsc

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఛైర్మన్‌గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. అభ్యర్థులకు పూర్తి విశ్వాసం కలిగించడం తన బాధ్యత అని టీజీపీఎస్‌సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం అన్నారు. వాయిదాలు ఉండవని.. అలాంటి ఆలోచనలు ఉంటే తొలగించుకోండన్నారు. డీఎస్సీ ఫలితాలు 60 రోజుల్లో ఇవ్వగలిగినట్లు తెలిపారు. Tgpsc రిజల్ట్స్ కూడా అనుకున్న టైమ్ లో ఇస్తామని హామీ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారమే అన్ని జరుగుతాయని మరోసారి స్పష్టం చేశారు. అంతా పారదర్శకంగా జరుగుతుందన్నారు. నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలనే మూడున్నర ఏళ్ల సర్వీస్ ను వదులుకొని వచ్చినట్లు తెలిపారు. యూపీఎస్సీ తో సమానంగా tgpsc పని చేస్తుందని కొనియాడారు.

READ MORE: Delhi: ఉబర్‌కు కోర్టు షాక్.. టైమ్‌కి క్యాబ్ రానందుకు రూ.54వేలు ఫైన్

తన మీద నమ్మకం తో పరీక్షలు రాయాలని.. ఎవరైనా పైరవీ చేస్తా నంటే వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పబ్లిక్ కు అందుబాటులో ఒక ఫోన్ నంబర్ పెడతామని చెప్పారు.
Tgpsc ఛైర్మన్ కు ఉన్నా విస్తృత అధికారాలను వినియోగించుకొని న్యాయం చేస్తామని వివరించారు. తెలంగాణ గెలిచి నిలవాలన్నారు.. ఐఏఎస్ కావాలని తన కల సాకారం అయిందని.. రాజీనామా చేసి ఇప్పుడు నిరుద్యోగుల కల సాకారం చేసేందుకు వచ్చినట్లు తెలిపారు.

READ MORE: Hyundai Motor: హ్యుందాయ్ లవర్స్కి షాక్.. జనవరి 1 నుంచి రూ. 25000 వేలు పెంపు..

కాగా.. టీజీపీఎస్సీ చైర్మన్‌గా ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశంను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. డిసెంబర్‌ 3తో మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 30న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2030 వరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ గా వెంకటేశం కొనసాగనున్నారు. బుర్రా వెంకటేశం నియామకానికి సంబంధించిన ఫైలుపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతకం చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.