Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Food Safety Raids: ఆహార భద్రతపై టీజీ సేఫ్ రంగంలోకి దిగింది. కమిషనర్ ఆదేశాల మేరకు టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని క్యూఆర్ఈ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, పోలీసు సిబ్బందితో కూడిన 10 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు చెందిన మొత్తం 20 డార్క్ స్టోర్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రత, నిర్వహణకు సంబంధించిన నిబంధనలను పరిశీలించారు. తనిఖీల్లో పలు స్టోర్లలో పరిశుభ్రత ప్రమాణాల నిర్వహణలో లోపాలు, ఆహార పదార్థాల నిల్వ విధానంలో నిర్లక్ష్యం, అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన స్టోర్ల యాజమాన్యాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నుంచి నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపించారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలును పర్యవేక్షించేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆహార పదార్థాలు, నిత్యవసర ఔషధాల నాణ్యతను, భద్రతను పర్యవేక్షించేందుకు ఏకీకృత వ్యవస్థగా ‘తెలంగాణ సేఫ్’ (TG-Safe – తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్) ను అమలులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు వేర్వేరుగా ఉన్న ఆహార భద్రత, ఔషధ నియంత్రణ విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ప్రజారోగ్య పరిరక్షణకు ఈ నూతన అథారిటీ ద్వారా కఠిన ప్రమాణాలు అమలు చేయనున్నట్లు తెలియజేశారు. దీని ద్వారా మార్కెట్లో లభించే ఆహార పదార్థాల్లో కల్తీని నిరోధించడం, నకిలీ, ప్రమాదకర మందుల విక్రయాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో తనిఖీలు పెరిగి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై తక్షణ చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని నిర్ణయించారు. ఫలితంగా పౌరులకు సురక్షితమైన ఆహారం, సమర్థవంతమైన మందులు అందుబాటులోకి వచ్చి, ప్రజారోగ్యానికి సంపూర్ణ భద్రత చేకూరుతుందని ఆకాక్షించారు. ఇందులో భాగంగానే నేడు టీజీ సేఫ్ ఈ చర్యలు చేపట్టింది.
Also Read
- Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
- Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
- BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
- Maharashtra: "ఇది కదా విశ్వాసం అంటే".. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
తాజావార్తలు
-
Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
-
Mokshada: రవితేజ సక్సెస్ వెనుక కూతురి హ్యాండ్! ‘ఇరుముడి’తో మోక్షద పేరు వైరల్..
-
Pakistan: పాకిస్థాన్ బిచ్చగాళ్లకు గల్ఫ్ దేశాల షాక్.. 20,000 మంది డిపోర్ట్!
-
Rahul Gandhi: 70 కోట్ల మంది మహిళలే తన ప్రత్యేక బలం.. పూణె సభలో రాహుల్ గాంధీ కీలక ప్రసంగం
-
BWF World Championships 2026: 15 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచ నంబర్-1తో పోరాడి కాంస్యం.. భారత బ్యాడ్మింటన్‌లో కొత్త చరిత్ర
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!