Hyderabad: సీఎం రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి
- 65 వేల కొత్త ఆటో రిక్షాలకు అనుమతి
- ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 263 విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ జీవో నెంబర్ 263 విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read:UP: కొంప ముంచిన కోతి.. రూ.20 లక్షల విలువైన నగల పర్సుతో జంప్..!
Also Read
- Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది. నగరంలో రోజురోజుకు జనాభా పెరుగుదల, ORR లోపల ఏర్పడిన కొత్త లేఅవుట్ల, అపార్ట్మెంట్లు ఫలితంగా పట్టణీకరణ వివిధ సవాళ్లు తలెత్తాయి. నగరంలో జనాభాలో అపారమైన పెరుగుదల కారణంగా ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ నగరంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, ప్రజా రవాణా మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్/LPG/CNG ఆటో రిక్షాలను అనుమతించడం అవసరమని ప్రభుత్వం భావించింది..
Also Read:Ravi Teja : మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు అనుమతి, 10 వేల కొత్త LPG ఆటో రిక్షాలకు అనుమతి, 10 వేల కొత్త CNG అటో రిక్షాలకు అనుమతి, డీజిల్, పెట్రోల్ వాహనాలకు సంబంధించిన ఆటోలకు రేటిరోఫీట్మెంట్ చేసి వాటి ఇంజన్ ను ఎలక్ట్రిక్, CNG,LPG లాగా మార్చుకోవడానికి 25 వేల వాహనాలకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న డీజిల్ ,పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్సఫర్ లేదా డీజిల్ పెట్రోల్, కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్ఆర్ పరిధిలో అనుమతించబడవు. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు CNG,LPG తీసుకురావడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. ఓ ఆర్ ఆర్ లోపల ప్రజా రవాణా ను మెరుగుపరచవచ్చు.. ఎలక్ట్రిక్ , LPG, CNG ఆటోలకు అనుమతి ఇచ్చి నగరంలో కాలుష్యాన్ని తగ్గించవచ్చు.. ఈ ప్రభుత్వ ఆదేశాల ద్వారా దాదాపు 65 వేల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 29 మంగళవారం దినఫలాలు.. ఈ రాశులవారికి అనుకోని గుడ్‌న్యూస్..
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!