హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల దృష్ట్యా పర్యావరణ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రవాణా శాఖ మంత్రి పొన్నం చొరవతో పెట్రోల్ ,డీజిల్ లేని 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది. కొత్త ఆటో రిక్షాలు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ లోపల పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ…