Tesla Cybertruck: ఈ కారు వాటర్‌లో బోట్లా పనిచేస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో వరదల్లో కార్లు కొట్టుపోవడం చూస్తుంటాం.. ఇప్పుడు నీళ్లపై బోట్లా వెళ్లే కార్లు రాబోతోఉన్నాయి.. వాటర్ బోట్ కార్లపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, త్వరలోనే నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. సైబర్‌ట్రక్ మాడల్ కారులో ఈ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు ఈ ప్రపంచ కుభేరుడు.. ఈ కారు వాటర్ ప్రూఫ్‌గా ఉండబోతోంది.. నీళ్లపై కాసేపు బోట్లా పనిచేస్తుందని వెల్లడించారు.. సైబర్‌ట్రక్ మాడల్ కారును నదులు, సరస్సులు, సముద్రాలు దాటేలా డిజైన్ చేస్తున్నామని ప్రకటించారు.. అయితే, 2019లోనే సైబర్‌ట్రక్ డిజైన్‌ను విడుదల చేసింది టెస్లా సంస్థ.. కానీ, అది ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు.. కానీ, వచ్చే ఏడాదిలో ఈ డిజైన్ కార్లను ఉత్పత్తి చేసేలా టెస్లా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ కారు బాడీని రాకెట్లలో ఉపయోగించే స్టెయిన్లెస్ స్టీల్‌తో తయారుచేయనున్నారు.. స్పోర్ట్స్ కారు కంటే ఎక్కువ సామర్థ్యంతో ఈ కార్లు పనిచేస్తాయని చెబుతున్నారు..
Also Read
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
- Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
సైబర్‌ట్రక్ మోడల్ పడవలా ఉపయోగపడేంత వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది, కనుక ఇది నదులు, సరస్సులు & సముద్రాలను కూడా దాటగలదు అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నారు టెస్లా సీఈవో.. టెస్లా సైబర్‌ట్రక్ నదులను దాటడానికి మరియు తక్కువ వ్యవధిలో పడవగా పనిచేయడానికి.. జలనిరోధితంగా ఉండబోతోందని ఎలాన్ మస్క్ చెప్పారు.. సైబర్‌ట్రక్ నీటిలో దాదాపు 360 మీటర్లు (1,100 అడుగులు) ప్రయాణించగలదని తెలుస్తోంది.. అయితే, టెస్లా వాహనాలను పడవగా ఉపయోగించగలగడం గురించి మస్క్ మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక టెస్లా మోడల్ S ఒక వరదలో ఉన్న సొరంగం ద్వారా డ్రైవింగ్ చేయడం లాంటివి పంచుకున్నారు.. తర్వాత మోడల్ Sని దాదాపు పడవగా ఉపయోగించవచ్చని సీఈవో చెప్పారు.. ఇక, 2020లో, ప్రజలు సైబర్‌ట్రక్‌ను పడవగా మార్చగలరని అనే ప్రచారం కూడా జరిగింది.. కానీ ఇప్పుడు, సైబర్‌ట్రక్ అండర్‌క్యారేజ్ “తగినంత వాటర్‌ప్రూఫ్”తో నీటిపై తేలుతూ వస్తున్నట్లు అనిపిస్తుంది.. మరియు చక్రాల నుండి వచ్చే ప్రొపల్షన్తో, డ్రైవర్లు నీటిలో నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందట.. ఆఫ్-రోడ్ వాహనంగా సైబర్‌ట్రక్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు.. రోడ్లపై చేరే నీరు తమను ఇక భయపెట్టదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఇది వాటర్ ప్లో ఎక్కువగా ఉంటే.. ఎలా పనిచేస్తుంది.. వాటర్‌లో దీని ప్రయాణం ఎలా సాగుతుంది అనే పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.
Cybertruck will be waterproof enough to serve briefly as a boat, so it can cross rivers, lakes & even seas that aren’t too choppy
— Elon Musk (@elonmusk) September 29, 2022
తాజావార్తలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Dimple Choudhary: ప్రముఖ డ్యాన్సర్‌తో అనుచిత ప్రవర్తన.. స్టేజ్‌పై కీచకుడి చెంపపగలగొట్టిన నర్తకి
-
Hyderabad Rains : హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. జలమయమైన రోడ్లు..!
-
Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్‌కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!