NTV Telugu Site icon

Tesla Cybertruck: ఈ కారు వాటర్‌లో బోట్‌లా పనిచేస్తుంది..

Tesla Cybertruck

Tesla Cybertruck

వర్షాకాలం వచ్చిందంటే చాలు కొన్ని ప్రాంతాల్లో వరదల్లో కార్లు కొట్టుపోవడం చూస్తుంటాం.. ఇప్పుడు నీళ్లపై బోట్‌లా వెళ్లే కార్లు రాబోతోఉన్నాయి.. వాటర్‌ బోట్‌ కార్లపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. అయితే, త్వరలోనే నీళ్లపై నడిచే కారును అందుబాటులోకి తెస్తామని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు. సైబర్‌ట్రక్‌ మాడల్‌ కారులో ఈ సదుపాయం ఉంటుందని పేర్కొన్నారు ఈ ప్రపంచ కుభేరుడు.. ఈ కారు వాటర్‌ ప్రూఫ్‌గా ఉండబోతోంది.. నీళ్లపై కాసేపు బోట్‌లా పనిచేస్తుందని వెల్లడించారు.. సైబర్‌ట్రక్‌ మాడల్‌ కారును నదులు, సరస్సులు, సముద్రాలు దాటేలా డిజైన్‌ చేస్తున్నామని ప్రకటించారు.. అయితే, 2019లోనే సైబర్‌ట్రక్‌ డిజైన్‌ను విడుదల చేసింది టెస్లా సంస్థ.. కానీ, అది ఇప్పటి వరకు మార్కెట్‌లోకి రాలేదు.. కానీ, వచ్చే ఏడాదిలో ఈ డిజైన్‌ కార్లను ఉత్పత్తి చేసేలా టెస్లా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ కారు బాడీని రాకెట్లలో ఉపయోగించే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో తయారుచేయనున్నారు.. స్పోర్ట్స్‌ కారు కంటే ఎక్కువ సామర్థ్యంతో ఈ కార్లు పనిచేస్తాయని చెబుతున్నారు..

Read Also: Actor Prudhvi Raj: ప్రతీనెల భార్యకు రూ.8 లక్షల భరణం ఇవ్వాల్సిందే.. సినీ నటుడు పృథ్వీరాజ్‌కు కోర్టు షాక్‌..

సైబర్‌ట్రక్ మోడల్‌ పడవలా ఉపయోగపడేంత వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది, కనుక ఇది నదులు, సరస్సులు & సముద్రాలను కూడా దాటగలదు అంటూ సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు టెస్లా సీఈవో.. టెస్లా సైబర్‌ట్రక్ నదులను దాటడానికి మరియు తక్కువ వ్యవధిలో పడవగా పనిచేయడానికి.. జలనిరోధితంగా ఉండబోతోందని ఎలాన్‌ మస్క్ చెప్పారు.. సైబర్‌ట్రక్ నీటిలో దాదాపు 360 మీటర్లు (1,100 అడుగులు) ప్రయాణించగలదని తెలుస్తోంది.. అయితే, టెస్లా వాహనాలను పడవగా ఉపయోగించగలగడం గురించి మస్క్ మాట్లాడటం ఇది మొదటిసారి కాదు. కొన్ని సంవత్సరాల క్రితం, ఒక టెస్లా మోడల్ S ఒక వరదలో ఉన్న సొరంగం ద్వారా డ్రైవింగ్ చేయడం లాంటివి పంచుకున్నారు.. తర్వాత మోడల్ Sని దాదాపు పడవగా ఉపయోగించవచ్చని సీఈవో చెప్పారు.. ఇక, 2020లో, ప్రజలు సైబర్‌ట్రక్‌ను పడవగా మార్చగలరని అనే ప్రచారం కూడా జరిగింది.. కానీ ఇప్పుడు, సైబర్‌ట్రక్ అండర్‌క్యారేజ్ “తగినంత వాటర్‌ప్రూఫ్”తో నీటిపై తేలుతూ వస్తున్నట్లు అనిపిస్తుంది.. మరియు చక్రాల నుండి వచ్చే ప్రొపల్షన్‌తో, డ్రైవర్లు నీటిలో నెమ్మదిగా వెళ్లాల్సి ఉంటుందట.. ఆఫ్-రోడ్ వాహనంగా సైబర్‌ట్రక్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు.. రోడ్లపై చేరే నీరు తమను ఇక భయపెట్టదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అయితే, ఇది వాటర్‌ ప్లో ఎక్కువగా ఉంటే.. ఎలా పనిచేస్తుంది.. వాటర్‌లో దీని ప్రయాణం ఎలా సాగుతుంది అనే పూర్తి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.