Site icon NTV Telugu

Jammu& Kashmir: జమ్మూకాశ్మీర్ లో ముగ్గురు వలస కార్మికులను కాల్చి చంపిన ఉగ్రవాదులు..

Jammu

Jammu

జమ్ముకాశ్మీర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. షోపియాన్ జిల్లాలో బీహార్ కు చెందిన ముగ్గురు వలస కూలీలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి చంపేశారు. ఈ ఘటన గగ్రాన్ అనే ప్రాతంలో జరిగింది. దీనిపై సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతాన్ని పోలీసులు, ఆర్మీ అధికారులు చుట్టుముట్టాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని అన్మోల్ కుమార్, పింటూ కుమార్ ఠాకూర్, హీరాలాల్ యాదవ్ గా పోలీసులు తెలిపారు. వీరిలో ముగ్గురు బీహార్ లోని సుపౌల్ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం వెంటనే హాస్పిటల్ కు తరలించామని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ లో పేర్కొన్నారు.

Read Also: ISRO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఇస్రో లో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ఉగ్రవాదుల దాడిని నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఖండించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ‘ఇది చాలా దురదృష్టకరం.. ఈ దాడిని ఖండిస్తున్నాం.. క్షతగాత్రులు త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానని ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. షోపియాన్ జిల్లా గగ్రాన్ లో నిరాయుధులైన స్థానికేతర కార్మికులపై ఉగ్రవాదులు దాడిపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ స్పందించారు. వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు.

Read Also: Pakistan: ఆర్థిక సంక్షోభంతో అమెరికాలోని ఎంబసీ భవనాన్ని అమ్మేసిన పాకిస్తాన్

కిరాణా సరుకులు కొనడానికి వెళ్లిన ముగ్గురు వలస కార్మికులపై జరిగిన భయంకరమైన దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల నిరాశ, అమానవీయత, చౌకబారుతనాన్ని ఇది ప్రతిబింబిస్తుందని జమ్ముకాశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ చర్యకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ఠాకూర్ పోలీసులను విన్నపం చేశారు. గాయపడిన ముగ్గురూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు.

Exit mobile version