నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్న సర్కార్ తాజాగా ఇస్రో లో నోటిఫికేషన్ ను విడుదల చేశారు. సైంటిస్ట్/ఇంజనీర్-SD, సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది..అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న వారు జులై 21 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రాత పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనున్నారు..
ఈ నోటిఫికేషన్ ప్రకారం..సైంటిస్ట్/ఇంజనీర్-SD పోస్టులకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సైంటిస్ట్/ఇంజనీర్-SC పోస్ట్ కోసం అప్లికేషన్ ఫీజు రూ.750 చెల్లించాలి. స్త్రీ/ SC/ ST/ EX-SM, PWBD అభ్యర్థులకు రాత పరీక్షకు కచ్చితంగా హాజరవ్వాలనే నిబంధనతో పూర్తి ఫీజును రీఫండ్ చేస్తారు. ఇతర అభ్యర్థులకు రాత పరీక్షకు హాజరైన తర్వాత వర్తించే బ్యాంకు ఛార్జీల తీసివేసి రూ.500 రూపాయలను రీఫండ్ చేస్తారు..ఇస్రో లైవ్ రిజిస్టర్ పోర్టల్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌లు స్వీకరిస్తారు..
అర్హతలు..
M.E/M.Tech లేదా సైన్స్‌లో M.S/M.Sc, బిఇ/బి.టెక్, B.Sc పూర్తి చేసిన వారు అర్హులుగా పేర్కొన్నారు. వ్యాలీడ్ అప్లికేషన్‌లను సబ్మిట్ చేసిన వారిని రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షను అహ్మదాబాద్, చెన్నై, ఎర్నాకులం, హైదరాబాద్ , తిరువనంతపురంలో నిర్వహిస్తారు. అభ్యర్థులు షరతులకు లోబడి మల్టిపుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు…పరీక్షలలో పాస్ అయిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు..కనీసం 10 మంది అభ్యర్థులతో 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూ కోసం షార్ట్-లిస్ట్ చేస్తారు. రిజర్వ్ చేసిన ఖాళీలకు 1:5 రేషియోలో రిజర్వ్ కాని అభ్యర్థులతో సంబంధం లేకుండా UR కేటగిరీ కింద షార్ట్-లిస్ట్ చేస్తారు. రాత పరీక్ష మార్కులకు 50% వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కులకు 50% వెయిటేజీ ఇస్తారు.. లక్షకు పైగా జీతం ఉంటుంది.. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ vssc.gov.inను సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు..