NTV Telugu Site icon

Asaduddin Owaisi: మణిపూర్ మండిపోతుంటే, జవాన్లు చనిపోతుంటే.. కర్ణాటకలో ప్రచారమా?.. మోదీపై ఒవైసీ ఫైర్

Asaduddin

Asaduddin

Asaduddin Owaisi: ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్‌షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్‌లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్‌లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్‌ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ‘పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మన సైనికులను హతమారుస్తుండగా.. మణిపూర్‌లో హింస చెలరేగుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ ‘ది కేరళ స్టోరీ’ అనే ‘ఫిక్షన్’ సినిమా గురించి మాట్లాడటం బాధాకరం’’ అని ఒవైసీ అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ని నరేంద్ర మోదీ ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.

అసదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో కొనసాగుతోంది. భజరంగ్ దళ్, బజరంగ బలి, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ వంటి అంశాలు వార్తల్లో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనేక అంశాలపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లో ఒకవైపు ఉగ్రవాదులు సైనికులను హతమారుస్తున్నారని, మణిపూర్ హింసాకాండలో మండిపోతోందని, మన దేశ ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఒవైసీ అన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతున్నాయని, అయితే పాకిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన ఐదుగురు సైనికులను హతమార్చారని, మణిపూర్‌లో మంటలు చెలరేగుతుంటే ప్రధాని ఎన్నికల కోసం ప్రచారం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోతున్నారు, కానీ అక్కడి ఎన్నికల్లో ప్రధాని ఆ డర్టీ పిక్చర్ (ది కేరళ స్టోరీ)ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏఐఎంఐఎం చీఫ్ ఇంకా మాట్లాడుతూ.. “ఇది తప్పుడు చిత్రం. ప్రధాని విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందడం కోసమే ప్రధాని ఇంత దిగజారారు. ప్రధానమంత్రి జాతీయవాదంపై ఎన్నికల ప్రసంగాలు మాత్రమే చేస్తారని, అయితే మన సైనికులు చనిపోయినప్పుడు మౌనంగా ఉంటారు.” అని అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు.

Read Also: Khalistan Commando Chief: ఖలిస్తాన్ కమాండో చీఫ్‌ పరమ్‌జిత్ పంజ్వార్‌ హత్య!

ఒవైసీ ఈ మాటల దాడి ఎందుకు చేస్తున్నారు?

వాస్తవానికి, కర్ణాటకలోని బళ్లారిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ‘కేరళ స్టోరీ’ సినిమాపై మాట్లాడుతూ, “ఉగ్రవాద కుట్రపై తీసిన సినిమా కేరళ కథ… ఇది ఒకే రాష్ట్రంలోని ఉగ్రవాద కుట్రలపై ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులు ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను ఈ చిత్రం బట్టబయలు చేస్తుంది” అన్నారు. ఈ నేపథ్యం ఆ సినిమా గురించి ప్రధాని వ్యాఖ్యలపై ఒవైసీ స్పందించారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 8న ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలోని 224 స్థానాలకు మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.