NTV Telugu Site icon

Mumbai: పోలీసులకు హడలెత్తించిన ఫోన్ కాల్.. ఉగ్రవాదులు ఉన్నారంటూ..

Mumbai

Mumbai

ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని ఫోన్ కాల్ రావడంతో షాక్‌కు గురి అయ్యారు. ముంబైలోకి ఉగ్రవాదులు ప్రవేశించారని సదరు వ్యక్తి పోలీసులకు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు ఏక్తా నగర్‌లో తలదాచుకున్నారని అతడు ఫోన్‌లో పోలీసులకు తెలిపారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు ఏక్తా నగర్ ఈ ఘటనపై విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.

Read Also: KTR: ఏడ్వాలంటే కాంగ్రెస్‌కు.. నవ్వాలంటే బీఆర్ఎస్‌కు ఓటేయండి

అందిన సమాచారం మేరకు ముంబై పోలీసులు సమాచారం అందుకున్నట్లుగానే దర్యాప్తు చేశారు. అయితే, తప్పుడు ఫోన్ కాల్ చేసినందుకు ఈ కేసులో లక్ష్మణ్ నానావరే అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 182, 505 (1) (బి) కింద నేరం నమోదు చేశారు. నిందితుడు లక్ష్మణ్ మద్యం మత్తు దిగిన తర్వాత విచారణ చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ముంబైలో టెర్రరిస్టులు ఉన్నారంటూ వచ్చిన ఫోన్ తో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎందుకంటే 26/11 దాడులను చూసిన ముంబై ప్రజలు వాటిని మరిచిపోలేదు.. ఈ దాడిలో మొత్తం 166 మంది చనిపోయారు. కాగా, ముంబై పోలీసులు ఉగ్రవాదులకు సంబంధించి 10 పరికారాల్లో తొమ్మిదింటిని ధ్వంసం చేశారు. మరోసారి ఉగ్రవాదులు అంటూ వచ్చిన ఫోన్ కాల్ తో పోలీసులు నగరంలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.