Terrorists: మధ్యప్రదేశ్‌లో ఉగ్రవాద మూలాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terrorists: ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్‌లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్పూర్లోని 13 ప్రాం తాల్లో ఎన్ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్ ఉత్ తహ్రీర్‌కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌యూటీ ఇస్లామిస్టుల సమాచారంతోనే జేఎంబీ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టు అయినవారి నుంచి వివరాలు సేకరిస్తే మరే ఇతర ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారు దొరుకుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్న హెచ్‌యూటీ ఉగ్రవాదులను అరెస్టు చేగా.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇటువంటి ఘటనలు చూస్తుంటే మధ్యప్రదేశ్‌లో రేపు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులు అరెస్టవుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. అంతలా అక్కడ ఉగ్రమూలాలు వేళ్లూనుకున్నాయి. హెచ్‌యూటీ ఉగ్రవాద సంస్థ మూలాలపై ఆరా తీస్తున్న క్రమంలో ‘జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్’ (జేఎంబీ)కి చెందిన పదిమందిని కేంద్ర నిఘా సంస్థ ఎన్ఐఏ తాజాగా అరెస్టు చేసింది.
Read Also: IPL 2023 Final: నేడు ఐపీఎల్ ఫైనల్.. ఈ రోజు కూడా వర్షం పడితే జరిగేది ఇదే..
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
ఏ రాష్ర్టానికి ఎన్నికల షెడ్యూల్ వచ్చినా సరిహద్దుల్లో సైన్యం చనిపోవటం.. కశ్మీర్లో తీవ్రవాదులపై దాడులు వంటివి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇది బీజేపీ ఎన్నికల స్టంట్ అని విమర్శలున్నాయి. మరికొన్ని నెలల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదుల సాకు చూపి, ఎన్నికల్లో గెలువాలనే దుర్బుద్ధితో కొందరు బీజేపీ నేతలు ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, బజరంగదళ్ వంటి సంస్థలకు చెందిన కొందరు కార్యకర్తలు పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే.. వారిని అరెస్టు చేసి, జైలుకు పంపుతామని ఎంపీ దిగ్విజయ్‌సింగ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇటువంటి ఎన్నో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేస్తే.. బోడిగుండుకు, మోకాలికి లింకుపెట్టి మాట్లాడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్.. మధ్యప్రదేశ్‌లో జేఎంబీ ఉగ్రవాదుల అరెస్టుతో తేలుకుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉన్నారని పలువురు తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై సక్రమంగా ఆరా తీస్తే.. ఏ పార్టీ లింకులు బయటపడతాయో వేచి చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..