IPL 2023 Final: నేడు ఐపీఎల్ ఫైనల్.. ఈ రోజు కూడా వర్షం పడితే జరిగేది ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL 2023 Final: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.. అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం కాగా.. భారీ వర్షం ఆటను అడ్డుకుంది. వరుణుడు కరుణిస్తే తప్ప ఈ రోజు రాత్రి 7.30కు కిక్కిచ్చే ఫైనల్ ఫైట్ జరగదన్నమాట.. దీంతో.. ఈ రోజు మ్యాచ్ ఉంటుందా? లేదా? ఒకవేళ ఈ రోజు మ్యాచ్ రద్దు అయితే జరిగేది ఏంటి అనే చర్చ సాగుతోంది.. అహ్మదాబాద్‌లో జరిగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా నిలిచిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నుంచి వాన పడుతూ, ఆగుతూ దోబూచులాడింది. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టీమ్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతుందనుకున్న మ్యాచ్.. అసలు మొదలవకుండానే ఆగిపోయింది. ఒకవేళ రాత్రి తొమ్మిదిన్నరలోగా వర్షం తగ్గితే… మ్యాచ్ నిర్వహిస్తారని అంతా భావించారు. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు.
Read Also: Astrology : మే 29, సోమవారం దినఫలాలు
Also Read
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
- Hyderabad Cyber Crime: 1980s ఫోటో ట్రెండ్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల బిగ్ వార్నింగ్..
కనీసం రాత్రి 11 గంటలకు వర్షం తగ్గినా.. ఓవర్లు కుదించి, విన్నర్ ఎవరనేది సస్పెన్షన్ లేకుండా తేల్చేయాలనుకున్నారు. అయితే భారీ వర్షానికి గ్రౌండ్ మొత్తం చెరువులా మారిపోయింది. వర్షపు నీరు గ్రౌండ్‌లో నిలిచిపోవడంతో.. దాన్ని క్లియర్ చేయడానికే సుమారు గంట సమయం పడుతుందని.. ఇక చేసేదేమి లేక ఆటను నిలిపివేశారు. దీంతో ఆటను రిజర్వ్ డేకు పోస్ట్ పోన్ చేశారు. ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఐపీఎల్ ఫైనల్ నిర్వహిస్తారు. ఇక ఈరోజు ఫైనల్ జరుగుతుందా..? లేదా అనే ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Read Also: GSLV-F12: సవ్యంగా సాగుతోన్న కౌంట్‌డౌన్ ప్రక్రియ.. నేడు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్–12 ప్రయోగం
నిన్నటి లాగే ఎడతెగని వర్షం ఈరోజు కూడా కురిస్తే సూపర్ ఓవర్ ద్వారానైనా విజేతను ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక వేళ అదికూడా సాధ్యం కాకపోతే మాత్రం.. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో లీగ్‌లో ఉన్న మ్యాచ్‌ను ఛాంపియన్‌షిప్‌గా ప్రకటిస్తారు నిర్వాహకులు. అలా జరిగితే 14 మ్యాచ్‌ల్లో పది విజయాలు సాధించిన గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్‌గా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కానీ, క్రికెట్ ప్రియులు మాత్రం మ్యాచ్ కచ్చితంగా జరుగుతుందనే దీమాతో ఉన్నారు. మరి ఈ రోజైనా వరుణుడు కరునిస్తాడా..? క్రికెట్ ఫ్యాన్స్ ఐపీఎల్ ఫైనల్ ఆస్వాదించేలా అవకాశం ఇస్తాడా? మ్యాచ్ జరిగితే గెలిచేది ఎవరు..? మిస్టర్ కూల్ తన సీనియార్టీని అంతా ఉపయోగించి మరోసారి కప్ అందుకుంటారా? దూకుడుగా ఉండే హార్ధిక్ పాండ్యా.. వరుసగా రెండోసారి గుజరాత్‌కు టైటిల్ అందిస్తాడా? అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.. సదరు క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం.. వరుణుడు కరుణించి.. మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
-
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
-
Suriya vs SK : సూర్య, శివకార్తీకేయన్ మధ్య సైలెంట్ ట్వీట్ వార్
-
Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!