NTV Telugu Site icon

Terrorists: మధ్యప్రదేశ్‌లో ఉగ్రవాద మూలాలు

Nia

Nia

Terrorists: ఈ మధ్య కాలంలో మధ్య ప్రదేశ్‌లో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిని కేంద్ర నిఘా సంస్థ ఎన్‌ఐఏ అరెస్టు చేస్తోంది. అందులో భాగంగా విశ్వసనీయ సమాచారం మేరకు శనివారం జబల్‌పూర్‌లోని 13 ప్రాం తాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసి, జేఎంబీ ఉగ్రసంస్థకు చెందిన వారిని అరెస్టు చేసింది. ఇదే నెలలో హిజ్బ్‌ ఉత్‌ తహ్రీర్‌కు చెందిన 16 మందిని తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌, భోపాల్‌ యాంటీ టెర్రరిస్టు స్కాడ్‌ పోలీసులు అరెస్టు చేశారు. హెచ్‌యూటీ ఇస్లామిస్టుల సమాచారంతోనే జేఎంబీ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టు అయినవారి నుంచి వివరాలు సేకరిస్తే మరే ఇతర ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వారు దొరుకుతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొన్న హెచ్‌యూటీ ఉగ్రవాదులను అరెస్టు చేగా.. నిన్న జేఎంబీ సంస్థకు చెం దిన ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఇటువంటి ఘటనలు చూస్తుంటే మధ్యప్రదేశ్‌లో రేపు ఏ సంస్థకు చెందిన ఉగ్రవాదులు అరెస్టవుతారో తెలియని పరిస్థితి నెలకొన్నది. అంతలా అక్కడ ఉగ్రమూలాలు వేళ్లూనుకున్నాయి. హెచ్‌యూటీ ఉగ్రవాద సంస్థ మూలాలపై ఆరా తీస్తున్న క్రమంలో ‘జమాత్‌ ఉల్‌ ముజాహిద్దీన్‌ బంగ్లాదేశ్‌’ (జేఎంబీ)కి చెందిన పదిమందిని కేంద్ర నిఘా సంస్థ ఎన్‌ఐఏ తాజాగా అరెస్టు చేసింది.

Read Also: IPL 2023 Final: నేడు ఐపీఎల్‌ ఫైనల్.. ఈ రోజు కూడా వర్షం పడితే జరిగేది ఇదే..

ఏ రాష్ర్టానికి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినా సరిహద్దుల్లో సైన్యం చనిపోవటం.. కశ్మీర్‌లో తీవ్రవాదులపై దాడులు వంటివి ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. ఇది బీజేపీ ఎన్నికల స్టంట్‌ అని విమర్శలున్నాయి. మరికొన్ని నెలల్లో బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ ఉగ్రవాదుల సాకు చూపి, ఎన్నికల్లో గెలువాలనే దుర్బుద్ధితో కొందరు బీజేపీ నేతలు ఉగ్రవాద సంస్థలను పెంచిపోషిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీజేపీ, బజరంగదళ్‌ వంటి సంస్థలకు చెందిన కొందరు కార్యకర్తలు పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నట్టు తమకు సమాచారం ఉన్నదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిస్తే.. వారిని అరెస్టు చేసి, జైలుకు పంపుతామని ఎంపీ దిగ్విజయ్‌సింగ్‌ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇటువంటి ఎన్నో అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్‌లో భోపాల్‌కు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేస్తే.. బోడిగుండుకు, మోకాలికి లింకుపెట్టి మాట్లాడిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్‌.. మధ్యప్రదేశ్‌లో జేఎంబీ ఉగ్రవాదుల అరెస్టుతో తేలుకుట్టిన దొంగలా కిక్కురుమనకుండా ఉన్నారని పలువురు తెలంగాణవాదులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఉగ్రవాద సంస్థలకు అందుతున్న నిధులపై సక్రమంగా ఆరా తీస్తే.. ఏ పార్టీ లింకులు బయటపడతాయో వేచి చూడాల్సి ఉంది.