Terror Group SIMI: ఉగ్రవాద సంస్థ సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం పొడిగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Terror Group SIMI: ఉగ్రవాద సంస్థ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. హోం మంత్రిత్వ శాఖ ఈ రోజు (జనవరి 29) ఈ సంస్థను కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారం దానిపై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించింది. ఇది నిషేధిత సంస్థ అని అందరికి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోడీ జీరో టాలరెన్స్ విధానాన్ని బలోపేతం చేస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం సిమిని ఐదేళ్ల పాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించారు. భారత్ సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని పెంచి, శాంతికి, మత సామరస్యానికి భంగం కలిగించడంలో ఈ సంస్థ ప్రమేయం ఉన్నట్లు తేలిందని అమిత్ షా అన్నారు. సిమి తన విధ్వంసకర కార్యకలాపాలను కొనసాగిస్తోందని, ఇంకా పరారీలో ఉన్న తమ కార్యకర్తలను మళ్లీ సమూహపరుస్తోందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మతతత్వం, శత్రుత్వం సృష్టించి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.
Read Also: Manohar Lal Khattar: హర్యానా సీఎం ఖట్టర్ సంచలన నిర్ణయం..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఈ సంస్థ 1977లో స్థాపించబడింది..
దేశంలో ఇస్లామిక్ జిహాద్‌ను వ్యాప్తి చేసే పనిలో ఈ సంస్థ ప్రమేయం ఉందని కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. ఈ సిమి నిషేధిత ఇస్లామిక్ విద్యార్థి సంస్థ అని తెలిసిందే. ఈ సంస్థ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో 25 ఏప్రిల్ 1977న స్థాపించబడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2001లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు సిమిపై తొలిసారి నిషేధం విధించారు. దీని తర్వాత, 2008లో కొన్ని రోజుల పాటు సంస్థపై నిషేధం ఎత్తివేయబడింది. అయితే, జాతీయ భద్రత దృష్ట్యా, అదే సంవత్సరం సంస్థను మళ్లీ నిషేధించారు. అప్పటి నుంచి ప్రతి ఐదేళ్లకు నిషేధం పొడిగించబడింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2014 ఫిబ్రవరి 1న ఐదేళ్ల పాటు నిషేధించబడింది. 2017లో గయాలో పేలుళ్లు, 2014లో బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం, 2014లో భోపాల్‌లో జైల్బ్రేక్ వంటి ఉగ్రవాద చర్యలలో సిమి సభ్యులు ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!