లీకు వీరులు ఎక్కువైపోయారు. తెలంగాణలో టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం దుమారం రేపుతుండగా వికారాబాద్ లో తాజాగా 10వతరగతి ప్రశ్నాపత్నం లీకైందన్న వార్త కలకలం రేపింది. ఏపీలోనూ ఇలాంటి లీకువీరుల కథ బయటకు వచ్చింది. అది కూడా సీఎం స్వంత జిల్లా కడపలో వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పదోతరగతి తెలుగు ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు మైక్రో జిరాక్స్ సమాధాన పత్రం ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన రెండు గంటల తరవాత మాస్ కాపీయింగ్ కోసం సమాధానాలతో కూడిన మైక్రో జిరాక్స్ చేస్తుండగా ఈ వ్యవహారం వెలుగు చూసింది.
Read Also:Sleeping in Office: నిద్ర కోసం సెలవు కూడా ఇచ్చిన కంపెనీ
ఎక్కడో ఈ పశ్రపత్రం లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నపత్రంలోని నంబర్ల వారీగా సమాధానాలను ఒకే పేపర్ లో అమర్చిన ఈ జిరాక్స్ సమాధాన పత్రం ఎక్కడ నుంచి వచ్చిందీ అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఎవరు ఈ సమాధాన పత్రం తయారు చేశారు. ఎక్కడి నుంచి వచ్చింది. అనేదానిపై విద్యాశాఖ అధికారులు కూడా విచారిస్తున్నారు. అయితే, జిల్లాలో ఎక్కడా ప్రశ్న పత్రం లీకేజీ కాలేదని, అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు కడప డీఈవో రాఘవరెడ్డి చెబుతున్నారు. అయితే సీఎం సొంత జిల్లా బ్రహ్మంగారి మఠంలో మాస్ కాపీయింగ్‌కు సమాధాన పత్రం వెలుగుచూడటం ఆసక్తికరంగా మారింది. ఈ లీకు వీరులు ఎవరనేది విచారణలో బయటపడుతుందని అధికారులు అంటున్నారు. పదవతరగతి పరీక్షలు జరుగుతున్న వేళ ఈ పరిణామం అటు విద్యార్ధులు, ఇటు తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Read Also: Sleeping in Office: నిద్ర కోసం సెలవు కూడా ఇచ్చిన కంపెనీ