AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల మొదటి రోజే తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జిల్లాలోని రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేసే విషయంలో టీడీపీలోని రెండు వర్గాల మధ్య తలెత్తిన విభేదాలు హై టెన్షన్‌కు దారితీశాయి. ఇరువర్గాలు భారీ సంఖ్యలో నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో వాతావరణం వేడెక్కింది.
నామినేషన్ వ్యవహారంలో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు విప్పర్లలో ఇంటింటి తనిఖీలు చేపట్టగా, టీడీపీలోని ఒక వర్గం వద్ద దాచి ఉంచిన పెట్రోల్ బాంబులు, కర్రలు, ఇతర మారణాయుధాలు బయటపడటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read
- Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
- Mitchell Santner: భారత్‌ను కట్టడి చేశాం.. కానీ అవే మా కొంపముంచాయి.. కివీస్ కెప్టెన్ ఆవేదన..
- Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లు.. 4.63 లక్షల మందికి మంజూరు.. కేటగిరీల వారీగా ఇలా..
- Ind Vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ జయకేతనం.. సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా..
మరోవైపు, నరసరావుపేట మండలం ఇసప్పాలెం వద్ద కూడా నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ములకలూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేసేందుకు ఇసప్పాలెం కేంద్రానికి చేరుకున్నారు. అయితే, ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్ కేంద్రంలోకి కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఉందని పోలీసులు స్పష్టం చేస్తూ వారిని అడ్డుకున్నారు. తమ అందరినీ లోపలికి అనుమతించాలంటూ వైసీపీ వర్గీయులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ములకలూరు వైసీపీ వర్గీయులు ఇసప్పాలెం నామినేషన్ కేంద్రం ఎదుట రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. టీడీపీ వర్గీయులకు, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చేస్తున్న వైసీపీ వర్గీయులకు నచ్చజెప్పి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
తాజావార్తలు
-
Warangal Fake Doctors : పెద్ద ఆసుపత్రుల్లో బిల్లుల బాదుడు.. చిన్న క్లినిక్‌లలో నకిలీ వైద్యులు.!
-
AP Eelctions: మొదటి రోజే రణరంగంగా పల్నాడు.. విప్పర్లలో పెట్రోల్ బాంబుల కలకలం..
-
OTR : తెలంగాణలో గిగ్ వర్కర్స్ పాలసీ.. కాంగ్రెస్ లక్ష్యం ఏంటి..?
-
Government Jobs: 7,390 ప్రభుత్వ ఉద్యోగాలు, నెలకు రూ. 2 లక్షల వరకు జీతం.. పూర్తి వివరాలివే!
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
ట్రెండింగ్
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!