హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్.. తుంటి నొప్పితో ఆ ఆస్పత్రిలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను పరామర్శించేందుకు ప్రముఖ నేతలు వచ్చి వెళ్తున్నారు. అయితే.. తాజాగా కేసీఆర్ ను చూడటానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆస్పత్రి ముందు జై కేసీఆర్, జై రామన్న అంటూ నినాదాలు చేశారు.
Read Also: Rajasthan CM: రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మ.. తొలిసారి ఎమ్మెల్యేని వరించిన పదవి..
ఈ క్రమంలో.. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు ఉండటంతో.. సోమాజిగూడ యశోద ఆస్పత్రి వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా.. అటుగా వెళ్లే సామాన్య ప్రజలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా.. ఆస్పత్రికి వచ్చే పేషంట్స్ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. ఆస్పత్రి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి వద్దకు పోలీసులు భారీగా చేరుకుంటున్నారు.
Read Also: Minister Konda Surekha: అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది..