Tenali Double Horse: భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తన ఆరోగ్యభరితమైన కొత్త ఉత్పత్తి శ్రేణి “మిల్లెట్ మార్వెల్స్” ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ JMD డా. సంగీత రెడ్డి ప్రారంభించారు. సూపర్ ఫుడ్స్ సెగ్మెంట్‌లోకి తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తీసుకున్న కొత్త అడుగు “మిల్లెట్ మార్వెల్స్”. ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులతో ఈ కొత్త “మిల్లెట్ మార్వెల్స్” ను ప్రవేశపెట్టారు.
మిల్లెట్ మార్వెల్స్ మొదటిగా 18 రకాల ఉత్పత్తులను గ్రైన్స్, నూడుల్స్, కుకీస్, రెడీ-టు-కుక్ విభాగాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో యూనిట్ ధర రూ. 95 నుండి ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ బ్రాండ్ పలు కొత్త శ్రేణుల్లోకి విస్తరించనుంది. ఇందులో ఆరోగ్యకరమైన మిలెట్స్, డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్, సజ్జి, పాస్తా, ఆరోగ్య పిండి పదార్థాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఫ్రీజ్ డైట్ పండ్లు, కూరగాయలు వంటి విభాగాలు ఉండనున్నాయి. మొదటి దశలో ఈ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పాన్ ఇండియా, అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ మునగాల మాట్లాడుతూ.. “రూరల్ టు గ్లోబల్” అన్న ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మిల్లెట్ మార్వెల్స్ ముఖ్యమైన మైలురాయి అవుతుందని తెలిపారు. ఈ కొత్త విభాగం ద్వారా మొదటి మూడు సంవత్సరాల్లో గ్రూప్ రెవెన్యూలో 5% వాటా సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2005 లో మినపగుండ్లుగా ఒక్క ఉత్పత్తితో ప్రారంభమైన తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఇప్పుడు 12 దేశాలు, 15 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకున్న సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ఈ సంస్థ పల్సెస్ అండ్ దాల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ల ఉత్పత్తులలోకి రానుంది. ప్రస్తుతం ఈ కంపెనీ రూ. 535 కోట్లు మించిన వార్షిక ఆదాయంతో ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఉండగా, సంస్థ రాబోయే మూడు సంవత్సరాల్లోనే నాలుగు అంకెల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది.