Char Dham Yatra : తాత్కాలికంగా చార్ధామ్ యాత్ర నిలిపివేత..
- ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు.
- కొండచరియలు విరిగిపడటంతో కొండపై నుండి పడిపోయిన రాళ్లతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించారు.
- యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Char Dham Yatra: ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ దృష్ట్యా, భక్తులందరూ జూలై 7న రుషికేశ్ దాటి చార్ ధామ్ యాత్రకు వెళ్లవద్దని అభ్యర్థించారు. ఇప్పటికే యాత్రకు వెళ్లిన వారు తమ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు వాతావరణం అనుకూలించే వరకు ఎక్కడున్నా వేచి ఉండాలని ఆయన కోరారు.
Darling Trailer: నా పెళ్లాం బెల్లం రా.. నవ్వులు పూయిస్తున్న డార్లింగ్ ట్రైలర్!
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
గత కొన్ని రోజులుగా ఉత్తరాఖండ్ లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండలపై కొండచరియలు విరిగి పడ్డాయని, కొండలపై నుంచి పడిన శిధిలాల కారణంగా బద్రీనాథ్ కు వెళ్లే హైవే చాలా చోట్ల మూసుకుపోయిందని సమాచారం. శనివారం నాడు చమోలి జిల్లాలోని కర్ణప్రయాగ్ లోని చత్వాపీపాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో కొండపై నుండి పడిపోయిన రాళ్లతో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యాత్రికులు మరణించారు. వారు బద్రీనాథ్ నుండి మోటార్ సైకిల్ పై తిరిగి వస్తుండగా ఈ సమయంలో ప్రమాదానికి గురయ్యాడు.
PM Modi : ఐదేళ్ల తర్వాత రష్యాకు వెళ్తున్న ప్రధాని మోడీ
ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా నదులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక జోషిమఠ్ సమీపంలోని విష్ణు ప్రయాగ్ లో అలకనంద ప్రమాదకర స్థాయికి చేరువలో ప్రవహిస్తోంది. అలకనంద విష్ణు ప్రయాగలో ధౌలి గంగలో విలీనమవుతుంది.
తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!