High Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. తెల్లవారుతూనే సూర్యుడు సెగలుగక్కుతున్నాడు. భానుడి భగభగలకు ఉదయం 9 గంటలకే మాడు బద్దలవుతోంది. బయటకు రావాలంటేనే జనం ఆలోచించాల్సిన పరిస్థితి.. దంచికొడుతోన్న ఎండలు.. రాబోయే మూడు రోజులూ మరింత పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలోనూ సన్ సెగ పెరిగింది. నేటి నుంచి మరో మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు మరింత పెరగనున్నాయి. దీంతో వివిధ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
Read Also: Telangana: తెలంగాణలో వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలి..!
ఈ జిల్లాల్లో విపరీతమైన ఎండలు ఉంటాయని, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పెరుగవచ్చని చెప్పింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో నేడు ఆరెంజ్ అలర్ట్ జారీచేశారు వాతావవరణ శాఖ అధికారులు.. ఇక, రేపు వేడిగాలులు కొనసాగుతాయని, తూర్పు, దక్షిణ తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ చెప్పింది. వచ్చే ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి.. మధ్యాహ్నం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. ప్రజలు భయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిఫులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప.. మధ్యాహ్నం బయటకు రాకపోవడమే మంచిదని హెచ్చరిస్తున్నారు.