BSNL Triple Play Services: ప్రైవేట్ టెలికం సంస్థలతో పోటీపడి మరీ సర్వీసులు అందించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వ టెలికం రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్ఎల్).. ఇప్పటికే ప్రైవేట్ టెలికం సంస్థల బాదుడు తట్టుకోలేక ఎంతో మంది బీఎస్ఎల్‌ఎల్ నెట్‌వర్క్‌కు మారుతున్నట్టు ట్రైయ్ లెక్కలు తేల్చాయి.. ఇక, ట్రిపుల్ ప్లే సర్వీసెస్‌లోకి అడుగు పెడుతుంది బీఎస్ఎన్ఎల్.. తక్కువ ధరలోనే వినియోగదారులకు ఈ సర్వీసు అందుబాటులోకి తీసుకురానుంది.. ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అంటే బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ మరియు టీవీ కోసం ఒకే ప్యాకేజీ అని అర్థం.
Read Also: Udaya Bhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ సినిమాకు నో.. ఉదయభానుపై ట్రోల్స్
అయితే, కర్నూలులో బీఎస్ఎన్ఎల్‌లో 400 రూపాయలకే ట్రిపుల్ ప్లే సర్వీసు ప్రారంభించారు టెలికాం ప్రిన్సిపల్ జీఎం రమేష్. రూ.400 కే హై స్పీడ్ ఇంటర్నెట్, 400 టీవీ ఛానళ్లు , 9 ఓటీటీలు.. అపరిమితమైన వాయిస్ కాలింగ్ కల్పిస్తామని వెల్లడించారు జీఎం రమేష్. మరోవైపు, కేవలం ఒక్క రూపాయికే ఫ్రీడమ్ ప్లాన్ సిమ్ కార్డు ఇస్తామని, 30 రోజుల పాటు ప్రతిరోజు 2 జీబీ డేటా, అపరిమితమైన కాల్స్ .. 100 ఎస్ఎంఎస్ లు ఉచితంగా పొందవచ్చని పేర్కొన్నారు.. ఆత్మనిర్భర భారత్ లో భాగంగా బీఎస్ఎన్ఎల్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను ప్రారంభించిందన్నారు టెలికాం ప్రిన్సిపల్ జీఎం రమేష్..