Mobile ReCharge: మొబైల్ యూజర్లకు బ్యాడ్‌న్యూస్.. పెరగనున్న రీఛార్జ్ ప్లాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలికాం సేవలందిస్తున్న కంపెనీలు తమ వినియోగదారులపై మరోసారి భారం మోపడానికి రెడీ అయ్యారు. లోక్ సభ ఎన్నికల తర్వాత టారిఫ్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, గత రెండేళ్లుగా ఛార్జీల్లో ఎలాంటి మార్పులు చేయని సంస్థలు ఈసారి ఎలాగైనా వాటిని పెంచాలని చూస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్కో టెలికం సంస్థ తమ టారిఫ్‌లను కనీసం 15 నుంచి 20 శాతం వరకు పెంచే ఛాన్స్ ఉందని బ్రోకరేజ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కస్టమర్ నుంచి వచ్చే సరాసరి ఆదాయం పెంచుకోవడంలో భాగంగా మరోసారి తమపై భారం మోపేందుకు టెలికం సంస్థలు సిద్ధమవుతున్నాయని తెలిపింది.
Read Also: Off The Record: బీఆర్ఎస్ పనికిరాడన్న నేతకి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎందుకిచ్చింది..?
Also Read
అయితే, కొంత కాలం నుంచి టెలికాం కంపెనీలు టారిఫ్‌ల పెంపునకు సరైన సమయం కోసం టెలికం సంస్థలు వేచి చూస్తున్నాయి. ఈమేరకు కంపెనీలు తమ ఇన్వెస్టర్ల సమావేశంలో పలుమార్లు టారిఫ్ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో అవి పూర్తి అయిన తర్వాత కంపెనీలు ఛార్జీల పెంపుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఎంట్రీ లెవల్ కస్టమర్ల కోసం టెలికం సంస్థలు వివిధ ధరల్లో ప్రత్యేక ప్లాన్లను ప్రకటించాలని చూస్తున్నారు. 4జీ, 5జీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి టెలికం సంస్థలు ఇష్టం వచ్చినట్లు టారిఫ్ ప్లాన్ల ధరల్లో మార్పులు చేసుకుంటు వస్తుంది.
Read Also: Drug Network: మరో భారీ డ్రగ్ నెట్వర్క్.. ఛేదించిన పంజాగుట్ట పోలీసులు..!
ఇక, తక్కువ ఆదాయం కలిగిన వారు తమ నెలవారి టారిఫ్ చెల్లింపులు భరించలేకపోతున్నారనే వాదనలు సైతం వస్తున్నాయి. టెలికం సంస్థలు వీరి కోసం స్పెషల్ ప్లాన్లను తీసుకు రావాలని కోరుతున్నారు. ఇక, 2021లో టారిఫ్‌లను పెంచిన టెలికాం కంపెనీలు 5జీ టెక్నాలజీ కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. దాంతో కంపెనీల ఖర్చులు భారీగా పెరిగాయి. ఆ వ్యయంలో కొంత మేర వినియోగదారుల నుంచి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికి అవి తొందరలోనే ఫలించబోతున్నట్లు కొందరు నిపుణులు తెలియజేస్తున్నారు.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!