NTV Telugu Site icon

T-Safe: అమ్మాయిలూ.. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా?

T Safe

T Safe

అమ్మాయిలు, మహిళల భద్రత కోసం సీఎం రేవంత్ రెడ్డి మార్చి 12 2024లో, టీ సేఫ్ అనే యాప్ ను లాంచ్ చేశారు. ఇప్పటివరకు 15,000 మందికిపైగా మహిళలు ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళల ప్రయాణ సమయంలో, పని ప్రాంతాల్లో వారి భద్రత కోసం ఈ యాప్ పనిచేస్తోంది. అపాయంలో ఉన్న మహిళలను గుర్తించి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలా ఈ యాప్ పనిచేస్తోంది. స్మార్ట్ ఫోన్ లో కాకుండా, సాధారణ ఫోన్ల ద్వారా కూడా టీ సేఫ్ వాడొచ్చు. మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నా ఈ యాప్ ను అభినందిస్తూ హీరో మాధవన్ టీ సేఫ్ ప్రచార వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. కోల్ కత్తా మహిళా డాక్టర్ హత్య నేపథ్యంలో టీ సేఫ్ దేశ వ్యాప్తంగా మరోసారి చర్చలోకి వచ్చింది.

READ MORE: Maharaja: బాలీవుడ్ చిత్రాలను వెనక్కి నెట్టి నెట్‌ఫ్లిక్స్‌లో మహారాజా మాస్ రికార్డ్..!

టీ సేఫ్ యాప్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించేందుకు ఏడు రాష్ట్రాలు ముందు కొచ్చాయి. ఇతర రాష్ట్రాలకు టీ సేఫ్ యాప్ ఆదర్శంగా మారటం, ప్రముఖ హీరో మాధవన్ తన ఎక్స్ అకౌంట్లో వీడియోను అప్లోడ్ చేసి ప్రమోట్ చేయడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. అమ్మాయిలు మహిళలు ఈ యాప్ ను వినియోగించాలని సూచించారు. మరింతగా ఈ యాప్ ను వినియోగం లోకి తేవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

READ MORE:Deputy CM Bhatti Vikramarka: పదేళ్లో లెక్క.. ఇప్పుడో లెక్క.. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా

కాగా.. అవగాహనా రాహిత్యం వల్ల చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవడం లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులు అందరూ తప్పకుండా ఈ యాప్ ను వినియోగించాలి. ప్రస్తుతం వనితల భద్రత కత్తిమీద సాములా మారింది. ఓ కంట కనిపెట్టుకుని ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట కీచకుల చేతికి చిక్కి బలవుతున్నారు. అందుకని ఈ యాప్ ను మీరు డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు పది మందికి అవగాహన కల్పించాలి. ఇంట్లో కూర్చొని చేసే ఈ స్వల్ప సాయం వల్ల రేపటి రోజున ఏదో ఒక చెల్లిని రక్షించిన వాళ్లమవుతాం. రామవారధి నిర్మాణంలో ఉడుత సాయంలా ఈ యాప్ గురించి ప్రతిఒక్కరికి తెలిసేలా చేద్దాం. మన సామాజిక కర్తవ్యాన్ని పూర్తి చేద్దాం.