Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar: రాష్ట్రవ్యాప్తంగా రవాణా నిబంధనలను ఉల్లంఘించే వాహనాలపై ఉక్కుపాదం మోపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ ఎన్ఫోర్స్మెంట్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేసి, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రవాణా కమిషనర్ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఓవర్లోడింగ్ (పరిమితికి మించి లోడ్) వాహనాలు, త్రైమాసిక పన్నులు చెల్లించని వాహనాలు, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేని వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలను అవసరమైతే వెంటనే సీజ్ చేయాలని రవాణా అధికారులకు సూచించారు.
గతంలో చెక్‌పోస్టులను రద్దు చేసిన సమయంలోనే ఎన్ఫోర్స్మెంట్ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. అందువల్ల ప్రస్తుతం అందుబాటులో ఉన్న సిబ్బందిని అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటూ తనిఖీల వేగాన్ని పెంచాలన్నారు. జూన్ 8 నుంచి ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రంగంలోకి దించిన మొబైల్ స్క్వాడ్ల పనితీరును సైతం ఈ సందర్భంగా ఆయన సమీక్షించారు. త్రైమాసిక పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్న వాహన యజమానులపై భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాలను స్వాధీనం చేసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. అలాగే ప్రయాణికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని.. స్లీపర్ బస్సుల్లో జరిగే నిబంధనల ఉల్లంఘనలను ఏమాత్రం ఉపేక్షించకుండా, గుర్తించిన వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Also Read
- UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
తాజావార్తలు
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
-
Pakistan: పాక్‌లో 5వ రాష్ట్రంగా గిల్గిట్-బాల్టిస్తాన్.. భారత్‌ను కవ్వించే చర్య..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?