NTV Telugu Site icon

Telangana Thalli Statue : తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం.. విగ్రహం ఫోటో చూసారా..?

Telangana Thalli Statue

Telangana Thalli Statue

Telangana Thalli Statue : తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈనెల 9వ తేదీన సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండనుంది. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పనులు వేగవంతం అయ్యాయి. ప్రస్తుతం విగ్రహం ఆవిష్కరించే స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ పనులను సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం పరిశీలించారు.

Vijayasai Reddy Tweet on Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌పై విజయసాయిరెడ్డి ట్వీట్‌ వైరల్..

ఆయనతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఫౌంటైన్ నిర్మాణ పనులపై వివరణలు తీసుకున్నారు. సెక్రటేరియట్ వద్ద విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో ఆగస్టు 8న భూమిపూజ జరిగింది. విగ్రహం చుట్టూ అదనపు అలంకరణలు కూడా ప్రభుత్వం చేయబోతోంది. రాత్రి సమయానికి లేజర్ లైట్లు, పెద్ద ఫౌంటెయిన్ నిర్మించబడుతుంది. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్‌పై కూడా సందర్శకులు ఈ విగ్రహాన్ని వీక్షించేందుకు అవకాశం ఉంది. విగ్రహం రూపు..ఎడమ చేతిలో వరి.. మొక్క జొన్న కంకి.. సజ్జ కంకీ.. మెడ లో కంటే.. చేతికి ఆకుపచ్చ గాజులు.. ఆకుపచ్చ చీర బంగారు రంగు అంచు.. పోరాట స్ఫూర్తిని తెలిపేలా… పిడికిళ్లు తెలంగాణతనం, పోరాట పటిమను ప్రతిబింబిస్తుందనడంలో సందేహం లేదు.

Car Sales : అమ్మకాలు క్షీణించినా.. అత్యధికా కస్టమర్లను పొందిన టాప్ 10కంపెనీలు ఇవే !

Show comments