Telangana TET : టెట్ అప్లికేషన్స్ కు ముగిసిన గడువు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రం లో ఆగష్టు నెల 1వ తేదీన టెట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆగష్టు 2వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. రాష్ట్రం లో సెప్టెంబర్ 15న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షలు జరగనున్నాయి. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు పేపర్-1 పరీక్షను రాసుకునేందుకు అవకాశం కల్పించారు.గతంలో సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఈడీ అభ్యర్థులకు మాత్రమే పోటీ పడే అవకాశం ఉండేది.కానీ 2018 న బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు పేపర్-2తో పాటు పేపర్-1కు కూడా రాసుకునే అవకాశం ఎన్సిటీఈ కల్పించింది.అయితే రాష్ట్రంలో 1.5 లక్షల మంది డిఈడి పూర్తి చేసినవారు అలాగే 4.5 లక్షల మంది బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నారు.గతంలో, టెట్ చెల్లుబాటు కేవలం 7 సంవత్సరాలు మాత్రమే ఉండేది.కానీ రెండేళ్ల క్రితం, టెట్ కాలవ్యవధిని జీవితకాలానికి పొడిగించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు టెట్‌కు అర్హత సాధించని వారు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. వీరే కాకుండా బీఈడీ, డీడీ పూర్తి చేసిన వారు మరో 20 వేల మంది వరకు ఉంటారు. వీరందరికీ తాజా టెట్‌తో మరోసారి పోటీ చేసే అవకాశం దక్కనుంది.అయితే తాజాగా విడుదల చేసిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తులకు గడువు బుధవారం అర్థరాత్రి తో ముగిసింది. రాత్రి 9 గంటలకు వరకూ 2,83,620 మంది అప్లై చేసినట్టు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.ఇందులో పేపర్ 1కు 80,990, పేపర్ 2కు 20,370 మంది అప్లై చేశారని వారు పేర్కొన్నారు. రెండు పరీక్షలకు1,82,260 మంది దరఖాస్తు చేసినట్టు చెప్పారు. అయితే మొత్తం 2,90,941 మంది ఫీజు చెల్లించారని తెలిపారు. కాగా, దరఖాస్తులకు బుధవారం సాయంత్రం 5 వరకే గడువు అని ప్రకటించినా కూడా ఆ తర్వాత 12 గంటల వరకూ సమయం పొడిగించారు. హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, గద్వాల, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ వంటి జిల్లాలలో సాయంత్రం 6 గంటల వరకే టెట్ సెంటర్లను అధికారులు బ్లాక్ చేశారు
Also Read
- Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
- IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
- Tirumala Srivari Brahmotsavam 2026: నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తిరుమలలో భారీ ఏర్పాట్లు
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
తాజావార్తలు
-
Kangana vs Rakhi Sawant: రాఖీ సావంత్‌పై కంగనా రనౌత్ ఫైర్.. కనీసం స్వీపర్ ఉద్యోగం కూడా దక్కలేదంటూ షాకింగ్ కామెంట్స్!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే!
-
IND vs AFG: సంజూ ఔట్.. వైభవ్ ఇన్.? నేడే రెండో టీ20 మ్యాచ్..! టీమిండియా ప్లేయింగ్ XI ఇలా..
-
Chiyaan 63 : ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘పవర్ హౌస్’గా విక్రమ్ 63..
-
Samsung Galaxy S26 FE: సామ్సంగ్ గెలాక్సీ S26 FE భారత్ లో లాంచ్.. 50MP కెమెరా, AMOLED 2X డిస్ప్లే
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!