Schools Reopen: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం.. బడిబాట పట్టనున్న విద్యార్థులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Schools Reopen: వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి (జూన్ 15) నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. సుదీర్ఘ సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకుంటుండటంతో విద్యాసంస్థలన్నీ విద్యార్థుల సందడితో కళకళలాడనున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 41, 673 పాఠశాలల్లో 63 లక్షల మందికి పైగా విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 26,000 ఉండగా. వాటిలో సుమారు 21.5 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు మరింత నాణ్యమైన సౌకర్యాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రాండెడ్ యూనిఫామ్‌లు, షూస్, బెల్ట్, టై, బ్యాగులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
Also Read
- US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే దాదాపు 2 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్టులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఇతర రవాణా వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. గత నెల రోజులుగా ఈ వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకుండా రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బస్సులను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు.
విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా తగినన్ని బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున.. విద్యార్థులు సకాలంలో, సురక్షితంగా తమ పాఠశాలలకు చేరుకునేలా అన్ని రవాణా సౌకర్యాలను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Upcoming Royal Enfield Bikes 2026: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి 3 కొత్త బైక్స్.. హిమాలయన్ 440, 750, GT 750 వచ్చేస్తున్నాయ్!
-
US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
-
Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
-
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
-
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
ట్రెండింగ్
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!