TGSRTC: విజయవాడ రూట్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్లపై భారీగా డిస్కౌంట్స్
- హైదరాబాద్ - విజయవాడ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్ న్యూస్
- నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్
- రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీ ప్రకటించిన TGSRTC.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TGSRTC: హైదరాబాద్ – విజయవాడ రూట్లలో ప్రయాణించే ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) గుడ్ న్యూస్ అందించింది. ప్రత్యేక రాయితీలను ప్రకటిస్తూ ప్రయాణికులకు సదుపాయాలు కల్పిస్తోంది ఆర్టిసి. విజయవాడ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులకు టీజిఎస్ఆర్టీసీ నాన్ ఏసీ లహరి స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. అలాగే, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం రాయితీని అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. TGSRTC ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరింది.
Read Also: Shivaji Maharaj Jayanti: తెలుగు నేలపై నడయాడిన ఛత్రపతి శివాజీ..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ఇదివరకే తెలంగాణ నుంచి బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణికులకు కూడా ప్రత్యేక రాయితీలను అందుబాటులోకి తెచ్చింది. బెంగళూరు రూట్లో నడిచే అన్ని సర్వీసుల్లోనూ రానుపోను ప్రయాణాలకు 10 శాతం డిస్కౌంట్ వర్తించనుంది. ఈ రాయితీ వల్ల ప్రయాణీకుల భారం తగ్గి, ఒక్కో వ్యక్తికి రూ.100 నుంచి రూ.160 వరకు ఆదా అవుతుందని అధికారులు తెలిపారు. ఇక త్వరలో రాబోతున్న మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ విషయంపై ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమైన శైవ క్షేత్రాలైన వేములవాడ, శ్రీశైలం, ఏడుపాయల, కీసర, పాలకుర్తి ప్రాంతాలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. బస్సు కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు.
విజయవాడ రూట్లో ప్రయాణించే వారికి గుడ్ న్యూస్!!
హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రత్యేక రాయితీలను #TGSRTC యాజమాన్యం ప్రకటించింది.
లహారి- నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 10 శాతం, రాజధాని ఏసీ బస్సుల్లో 8 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్ల… pic.twitter.com/KpjA2rwC3J
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 19, 2025
KCR: పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణ నుండి శ్రీశైలానికి భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేసి ఆర్టీసీ కూడా ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. శివరాత్రి నేపథ్యంలో ఫిబ్రవరి 19 నుండి మార్చి 1 వరకు శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో, భక్తులకు అధిక సంఖ్యలో బస్సులను అందుబాటులో ఉంచేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించేలా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!