NTV Telugu Site icon

Drugs Mafia: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం..

Drugs12

Drugs12

Drugs Mafia: డ్రగ్స్‌పై తెలంగాణ పోలీస్ ఉక్కుపాదం మోపింది. డ్రగ్స్ ని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు డ్రగ్స్ మాట వినపడద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు వెనుకాడ వద్దని అధికారులకు ప్రభుత్వం కరాకండిగా చెప్పింది. అంతేకాకుండా స్కూల్ స్థాయి వరకు చేరిపోయిన డ్రగ్స్ ని నియంత్రణ చేయకపోతే భవిష్యత్తు తరాలు పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయ పడింది. ఈ నేపథ్యంలోనే డ్రగ్స్ కట్టడి కోసం ప్రభుత్వం నార్కోటిక్ బ్యూరోని ఏర్పాటు చేసింది. దీనికి డీజీ స్థాయి అధికారులు నియమించింది. పెద్ద ఎత్తున నిధులతో పాటు సిబ్బందిని కేటాయించింది. మరోవైపు డ్రగ్స్ కిట్లను కూడా ఏర్పాటు చేసింది. అప్పటికప్పుడు పరీక్షలు చేసి నివేదికరించే ఇచ్చి డ్రగ్స్ కిట్లను కూడా నార్కోటికి బ్యూరో అందించింది. మరోవైపు నర్కోటి బ్యూరోకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. దీంతోపాటు డ్రగ్స్ అమ్మకం కొనుగోలు దారులపై నిగా పెట్టేందుకు అవసరమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. గత ఆరునెల కాలంలో ఊహించినీ రీతి లో నార్కోటికి బ్యూరో ఫలితాలు అందించింది.

Daggubati Purandeswari: రాజమండ్రి రైల్వే స్టేషన్ లో ఎంపీ పర్యటన..

అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వస్తున్న గంజాయిని కూడా కట్టడి చేసేందుకు ఈ బ్యూరో సఫలీకృతమైంది. ముఖ్యంగా ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల నుంచి పెద్ద ఎత్తున గంజాయి హైదరాబాద్కు చేరుకుంటుంది . కొన్ని సందర్భాల్లో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. గంజాయికి హైదరాబాద్ ట్రాన్సిట్ పాయింట్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఆంధ్ర ఒడిస్సా రాష్ట్రాల నుంచి వస్తున్న గంజాయిని కట్టడి చేసేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. గత ఆరు నెలల కాలంలో నార్కోటిక్ బ్యూరో విపరీతమైన ఫలితాలను సాధించింది అంతేకాదు హైదరాబాద్ కి డ్రగ్ పెడ్లర్స్ రావాలంటే భయపడే స్థాయికి ఎదిగిపోయింది. దీంతోపాటు బ్యూరోకి పెద్ద మొత్తంలో సమాచారం వస్తుంది నిఘా వ్యవస్థని ప్రతిష్ట చేయడంతో ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ నుంచి సమాచారం ఈజీగా అందుతుంది.

Minister Ponguleti: కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నాం..

2024లో జనవరి-జూన్ వరకు 84.3 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కో కాయిన్ హెయిర్ పెద్ద మొత్తంలో ఉన్నాయి స్థానిక మార్కెట్ల ప్రకారం 84 కోట్లు ఉండగా అది అంతర్జాతీయ మార్కెట్లోకి వెళ్తే దాదాపు 800 కోట్ల వరకు చేరుకునే అవకాశం ఉంటది. సింథటిక్ డ్రగ్స్ అని పెద్ద ఎత్తున అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అయితే, స్వాధీన పరుచుకున్న డ్రగ్స్ ని కూడా ఎప్పటికప్పుడు బయో కెమికల్స్ కంపెనీలో ధ్వంసం చేస్తున్నారు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అనుమానంతో మూడు నెలలకు ఒకసారి ఈ డ్రగ్స్ మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి పెడుతున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 938 కేసులు నమోదు చేయగా, 1921 మంది నిందితుల అరెస్ట్ చేశారు. డ్రగ్స్ అనగానే మనకు ఒకటే గుర్తొస్తుంది హైరెయిన్ మాత్రమే గుర్తుకొస్తుంది. దీని తర్వాత అత్యధికంగా అతి తక్కువ ధరకు లభ్యం అవుతుంది. గంజాయి స్కూల్ స్థాయి నుంచి కాలేజీల వరకు ఈ గంజాయి లభ్యమవుతుంది.

Wayanad Landslides : మృతుల సంఖ్య 340.. 217 మృతదేహాలు, 143 శరీర భాగాలకు పోస్టుమార్టం పూర్తి

ఇంజనీరింగ్ విద్యార్థుల దగ్గర్నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల వరకు ఈ గంజాయి దొరుకుతుంది. గల్లి గల్లిలో కూడా గంజాయి లభ్యమవుతుంది. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు నుంచి హైదరాబాద్కు వస్తుంది. వివిధ మార్గాల్లో హైదరాబాద్కు తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్మి వేస్తున్నారు. గంజాయి అమ్మకాల్లో 25 మంది దూల్పేట్ కు చెందిన వారు కీలకపాత్ర పోషిస్తున్నారని ఇటీవల అధికారులు ప్రకటించారు. ఇందులో కొంతమంది అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా కొందరు బయట తిరుగుతున్నారని వాళ్ళ ద్వారా గంజాయిగా హైదరాబాద్కు చేరుకుంటుందని అధికారులు చెప్పారు. అత్యధికంగా గంజాయి కేసులు 816 నమోదు కాగా, 1649 ను అరెస్ట్ చేశారు. మరోవైపు నర్కోటి బ్యూరో రంగంలోకి దిగిన తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది ఎవరైతే డ్రగ్స్ విక్రయిదారులు ఉన్నారో వాళ్ళ ఆస్తులను పూర్తిగా జప్తి చేసే పని మొదలుపెట్టారు. ఆస్తులు మొత్తాన్ని ఫ్రీ చేసి అమ్మే పని మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఐదుగురు బడ డ్రగ్ స్మగ్లర్లకు సంబంధించిన 100 కోట్ల పై చిలుకు ఆశలను అధికారులు ఫ్రీజ్ చేశారు.

Show comments