The Dark Side of Electric Vehicles: “నమ్మశక్యం కాని నిజం”.. ఎలక్ట్రిక్ కార్ల వల్లే అధిక కాలుష్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The Dark Side of Electric Vehicles: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహన శ్రేణిలో వీటి వృద్ధి అధికంగా ఉంది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విక్రయాలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలో 2030 నాటికి మొత్తం వాహన విక్రయాల్లో 30 శాతం ఈవీలు ఉండాలన్నది కేంద్రం లక్ష్యం. దీని ద్వారా వాయు కాలుష్యం, ఇంధన దిగుమతుల తగ్గింపు సాధించవచ్చని కేంద్రం భావిస్తోంది. కానీ.. దీని వెనుక “నమ్మశక్యం కాని నిజం”కాని మరో నిజం ఉంది.. నిజానికి పెట్రోల్-డీజిల్ కార్ల కంటే ఈ వాహనాల వల్ల పర్యావరణానికి ఎక్కువ హాని కలుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ప్రక్రియ, వాటి బ్రేక్‌లు, టైర్లు లేదా వాటి బ్యాటరీలు ఊహించలేనంత కాలుష్యాన్ని కలిగిస్తాయి. ఎలా, ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం.
READ MORE: Nubia Fold, Nubia Flip3 రెండు కొత్త ఫోల్డబుల్ ఫోన్లను లాంచ్ చేసిన నుబియా.. ఫీచర్స్ ఇవే..!
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
ఈవీ, సాధారణ ఇంజిన్‌ల ఉద్గారాలను పోల్చినప్పుడు.. ఈవీలను ఉత్పత్తి చేసేటప్పుడు 46 శాతం కార్బన ఉద్గారాలు వస్తున్నట్లు కనుగొన్నారు. సాధారణ వాహనాల్లో ఇది 26 శాతంగా ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఎలక్ట్రిక్ కారును తయారు చేసే ప్రక్రియలో దాదాపు 5-10 టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఇది పర్యావరణానికి చాలా ప్రమాదం.. ఈవీ, సాధారణ వాహనంలో బాడీ, ఛాసిస్, ఇతర భాగాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. వాటి తయారీలో అల్యూమినియం, స్టీల్ వంటి లోహాలను ఉపయోగిస్తారు. అయితే ఈవీ బ్యాటరీతో నడుస్తుంది. వీటిల్లో లిథియం అయాన్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఇవి భూమిలో లభించే అరుదైన లోహాలతో తయారు చేస్తారు. ఐఎమ్‌ఎఫ్ నివేదిక ప్రకారం.. సాధారణ ఈవీ బ్యాటరీని తయారు చేయడానికి 8 కిలోల లిథియం, 35 కిలోల మాంగనీస్, 6 నుంచి 12 కిలోల కోబాల్ట్ అవసరం. వీటిలో, కోబాల్ట్ అరుదైన ఎర్త్ మెటల్. ఇది సులభంగా లభ్యం కాదు. కాబట్టి బ్యాటరీ తయారీలో దాని పరిమాణాన్ని తగ్గించడానికి కోబాల్ట్ కంటే చౌకైన నికెల్‌ను ఉపయోగిస్తారు. ఒక్క బ్యాటరీ తయారీలో ఇవన్నీ ఉపయోగిస్తారు. అయితే ఈ లోహాల మైనింగ్ అతిపెద్ద పర్యావరణ ఆందోళన. లిథియం, కోబాల్ట్ వంటి లోహాలను భూమి నుంచి తీస్తే 4,275 కిలోల యాసిడ్ వ్యర్థాలు, 57 కిలోల రేడియోధార్మిక అవశేషాలు ఉత్పత్తి అవుతాయి.
READ MORE: Pamela Satpathy: “మీరు సూపర్ మేడం”.. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంచే పాట పాడిన కలెక్టర్..
లిథియం ఎందుకు ప్రమాదకరం?
ఒక టన్ను లిథియం దాదాపు 100 ఈవీ వాహనాలకు బ్యాటరీలను తయారు చేయగలదు. అయితే ఈ ఒక టన్ను లిథియంను వెలికితీయాలంటే 2 మిలియన్ టన్నుల నీరు అవసరం. ఒక ఈవీకి చెందిన బ్యాటరీ తయారీకి 13,500 లీటర్ల నీటిని వినియోగిస్తారు. అయితే పెట్రోల్ కారు దాదాపు 4,000 లీటర్లు వినియోగిస్తుంది. దీని వల్ల చిలీ, బొలీవియా, అర్జెంటీనా దేశాల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. ఒక్క చిలీలో 65 శాతం నీటిని లిథియం తీయడానికి వాడుతున్నారు. నికెల్, కోబాల్ట్ గనులు ఉన్న క్యూబాలో దాదాపు 570 హెక్టార్ల భూమి బీడుగా మారింది. 10 కిలోమీటర్లకు పైగా ప్రాంతం కలుషితమైంది. అధిక కాలుష్యం కారణంగా ఫిలిప్పీన్స్ 23 నికెల్, కోబాల్ట్ గనులను మూసివేయవలసి వచ్చింది. అల్యూమినియం గురించి మాట్లాడినట్లయితే.. ఈవీ తయారు చేయడానికి సుమారు 250 కిలోల అల్యూమినియం ఉపయోగించబడుతుంది. ఇది సగటు పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్ కంటే 25-27% ఎక్కువ. 2030 నాటికి ఈవీ పరిశ్రమ డిమాండ్‌ను తీర్చడానికి 10 మిలియన్ టన్నుల అల్యూమినియం అవసరం అవుతుంది.
ఛార్జింగ్ ప్రక్రియ సైతం ప్రమాదమే..
ఈవీ ఛార్జింగ్ పర్యావరణానికి చాలా అనుకూలంగా కనిపించడం లేదు. ప్రజలు ఇంట్లో లేదా ఛార్జింగ్ స్టేషన్లలో ఈవీలను ఛార్జ్ చేస్తారు. అయితే వాటికి ఛార్జ్ చేస్తున్న విద్యుత్ ఎక్కడ, ఎలా ఉత్పత్తి అవుతోంది? రికార్డో కన్సల్టెన్సీ ప్రకారం.. బొగ్గుతో ఉత్పత్తి చేయబడిన విద్యుత్‌తో ఈవీని ఛార్జ్ చేస్తే, 1.5 లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాత, అది పెట్రోల్ కారు కంటే 20% తక్కువ కార్బన్‌ను మాత్రమే విడుదల చేస్తుంది. భారతదేశంలో 70% విద్యుత్ బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తారు.
చెడిపోయిన బ్యాటరీలతో ముప్పు!
బ్యాటరీ జీవితం ముగిసినప్పుడు.. వాటిని పారేయాల్సి ఉంటుంది. లేదా పల్లపు ప్రదేశాలలో పాతి పెట్టాలి. ఇది పర్యావరణానికి మరింత ప్రమాదకరం. ఇది కార్బన్ వ్యప్తిని మరింత పెంచుతుంది. బ్యాటరీలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. కొన్ని కంపెనీలు బ్యాటరీ రీసైక్లింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసినప్పటికీ.. మొత్తం బ్యాటరీలలో 5 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. లిథియం ప్రపంచంలోనే అత్యంత తేలికైన లోహం అని అరిజోనా విశ్వవిద్యాలయం ఎకాలజీ విభాగానికి చెందిన ఎమెరిటస్ ప్రొఫెసర్ గై మెక్‌ఫెర్సన్ చెప్పారు. “ఇది చాలా సులభంగా ఎలక్ట్రాన్‌లను వదులుతుంది. లిథియం గ్రీన్ ఫ్యూయల్ అని కీర్తించబడుతోంది. కానీ దానిని భూమి నుంచి తీయడం పర్యావరణానికి 3 రెట్లు ఎక్కువ విషపూరితం. 98.3% లిథియం బ్యాటరీలను ఉపయోగించిన తర్వాత గుంతల్లో పాతిపెట్టాల్సి వస్తుంది. బ్యాటరీ పాడయ్యాక నీటితో చర్య జరుపుతుంది. ఒక వేళ దానికి నీరు తగిలితే.. వెంటనే మండుతుంది. జూన్ 2017 నుంచి డిసెంబర్ 2020 వరకు.. అమెరికాలోని పసిఫిక్ నార్త్‌వెస్ట్‌లోని ఒక పిట్‌లో ఈ బ్యాటరీల నుంచి 124 ప్రమాదాలు జరిగాయి.” అని ఆయన వెల్లడించారు.
READ MORE: Pamela Satpathy: “మీరు సూపర్ మేడం”.. దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంచే పాట పాడిన కలెక్టర్..
ఇతర ఇంధనాలతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్‌లు, టైర్లు 1850 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తాయని ఓ పరిశోధన నివేదిక పేర్కొంది. ఎమిషన్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. ఈ అదనపు బరువు బ్రేక్‌లు, టైర్లపై పడి వాటి జీవితకాలం వేగంగా తగ్గిపోతుంది. అధిక బరువు కారణంగా దాని టైర్లు త్వరగా అరిగిపోతాయి. త్వరగా అరిగిపోయిన టైర్లు హానికరమైన రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయి. చాలా టైర్లు సింథటిక్ రబ్బరుతో తయారు చేస్తారు. ఇవి కాలుష్యానికి ప్రమాదం. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో అమర్చిన ఈ అర టన్ను బ్యాటరీ పెట్రోల్ కారు కంటే 400 రెట్లు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని నివేదిక వెల్లడించింది.
ఎకో ఫ్రెండ్లీ అని ఎలా అంటారు?
ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఈవీలను ఎకో ఫ్రెండ్లీ అని ఎలా అంటారు? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈవీ కార్ల తయారీ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అందుకే ఇందులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ ఈవీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించే విద్యుత్ బొగ్గు నుంచి తీసుకోకపోతే, మైనింగ్ ప్రక్రియను డీకార్బనైజ్ చేసినట్లయితే ఈవీలు పర్యావరణ అనుకూలమైనవిగా మారవచ్చు. దాని బ్యాటరీని రీసైకిల్ చేయడానికి, చెడిపోయిన బ్యాటరీలను సురక్షితంగా మట్టిలో కలిసి పోయేలా చేస్తే.. ఈవీలు కూడా ప్రకృతికి మేలు చేసేవిగా తయారవుతాయి. ఈవీల తయారీ ప్రారంభదశలోనే ఉంది. కాబట్టి ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?