CM Revanth Reddy : పేదల పెద్ద దవాఖానాకు ఏర్పాట్లు పూర్తి.. రేపు భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
- పేదల పెద్ద దవాఖానాకు ఏర్పాట్లు పూర్తి
- రేపు గోషామహల్ స్టేడియంలో భూమిపూజ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
- రూ.2,150 కోట్లతో అత్యాధునిక హంగులతో ఆస్పత్రి నిర్మాణానికి ఏర్పాట్లు
- 26 ఎకరాల్లో విశాలమైన ఆస్పత్రి నిర్మాణానికి రంగం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ వైద్యారోగ్య చరిత్రలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. వందేళ్లుగా తెలంగాణతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలందించిన ఉస్మానియా నూతన ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి అఫ్జల్ గంజ్‌లో ఉండగా.. నూతన ఆసుపత్రిని గోషామహల్ స్టేడియంలో నిర్మించనున్నారు. నూతన ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేయనున్నారు. 2 వేల పడకల సామర్ధ్యంతో మొత్తం 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన ఆసుపత్రిని నిర్మించనున్నారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ నూతన ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది.
పూర్తి వసతులతో…
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు నూతన ఆసుపత్రిని నిర్మించాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా.. అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు, ప్రతి డిపార్ట్మెంట్కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు, ప్రతి థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు,అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చురీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్లకు రూపకల్పన చేశారు. అలాగే అండర్ గ్రౌండ్ రెండు ఫ్లోర్లలో పార్కింగ్, ఆసుపత్రి సమీపంలో ఫైర్ స్టేషన్, ఆసుపత్రి చుట్టూ విశాలమైన రహదారులు, ఆసుపత్రి ప్రాంగంణంలో ఎక్కడికైనా ఫైర్ ఇంజిన్లు, అంబులెన్స్‌లు తిరిగే మార్గాలు, దివ్యాంగులు ఆసుపత్రిలోకి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్‌లు, ఆసుపత్రిలోని రోగులకు సహాయకులుగా వచ్చే వారు సేద తీరేందుకు డార్మెటరీలు, క్యాంటీన్, మరుగుదొడ్లు నిర్మించనున్నారు.
Ranji Trophy: రంజీ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాది.. రికార్డు సృష్టించిన బ్యాటర్
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!