Kavitha: కవిత ఖాతాలో ఆ మున్సిపాలిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kavitha: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే చాలా మున్సిపాలిటీల ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఖాతాలో ఒక మున్సిపాలిటీ చేరింది. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(AIFB) పార్టీ ఘన విజయం సాధించింది. ఏఐఎఫ్బీ తరఫున పోటీ చేసిన కీలక అభ్యర్థి శ్రీను గత నెల రోజుల కింద మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత వెంట ఉన్నారు. ఆమెతో కలిసి పని చేశారు. అయితే.. వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులకు గానూ.. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 గెలుచుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఒక్కో సీటు లభించింది. బీజేపీ, జనసేనకు మాత్రం ఒక్క సీటు కూడా రాలేదు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన కవిత మద్దతుదారులు 8 వార్డులను కైవసం చేసుకోవడంతో ఆమె అకౌంట్లో ఒక మున్సిపాలిటీ చేరింది. ముందుగానే కవిత తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరుపున పోటీ చేస్తారని కవిత ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీలో విభేధాల అనంతరం పార్టీ కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె ఒంటిరిగా మిగిలిపోయింది. ఈ విభేధాల అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో ఏకంగా ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఆసక్తిగా మారింది.
READ MORE: Zaima Rahman: ట్రెండింగ్‌గా తారిక్ రెహమాన్ కుమార్తె.. బంగ్లాదేశ్ ఫలితాల్లో ఏ మ్యాజిక్ చేసిందంటే..!
Also Read
- Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
- Amit Shah: ‘‘దేశ ప్రజలు మీ పాపాలను క్షమించరు’’.. సోనియాగాంధీపై అమిత్ షా ఫైర్..
- Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. "మిస్టర్ 10%" అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
- West Bengal: కాంగ్రెస్ నేత, కుమారుడి కాల్చివేత.. ఇంటికి వెళ్తున్న సమయంలో దారుణం..
తాజావార్తలు
-
Gold Coins: మురికి కాలువలో బంగారు నాణేలు.. తవ్వుతున్న కొద్దీ దొరుకుతూనే ఉన్నాయ్..
-
Amit Shah: ‘‘దేశ ప్రజలు మీ పాపాలను క్షమించరు’’.. సోనియాగాంధీపై అమిత్ షా ఫైర్..
-
VishwanathAndSons : రెండురోజుల్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’
-
Rajasthan Crime: తాత హత్యకు దారితీసిన పెళ్లి వివాదం
-
Javed Akhtar: హిందువులపై పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు.. “మిస్టర్ 10%” అంటూ జావెద్ అక్తర్ కౌంటర్..
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?