Site icon NTV Telugu

Telangana Municipal Elections: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.. రాష్ట్రవ్యాప్తంగా 73.01% పోలింగ్ నమోదు!

Municipal

Municipal

Telangana Municipal Elections: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 66.05 శాతం, అలాగే 116 మున్సిపాలిటీలలో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది.

Cambodia Cyber Scam: కేజీఎఫ్‌ను తలపించిన సైబర్‌ సామ్రాజ్యం.. వందల సంఖ్యలో ఉద్యోగులు!

మున్సిపాలిటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా, నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం ఓటింగ్ నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్లలో నల్గొండ కార్పొరేషన్‌లో అత్యధికంగా 77.36 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది.

Proddatur: బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు! క్షణాల్లో బురిడీ కొట్టించి ఉడాయింపు.!

ఓట్లు వేసిన జాబితాలో మహిళలు స్వల్పంగా ముందంజలో నిలిచారు. పురుష ఓటర్లలో 72.63 శాతం కాగా, మహిళా ఓటర్లలో 73.39 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు.

Exit mobile version