Site icon NTV Telugu

Ponnam Prabhakar: తనిఖీలు చేయకపోవడం వల్లే ప్రమాదం.. టీజీ రవాణా శాఖ మంత్రి సంచలన వ్యాఖ్యలు..

Ponnamprabhakar

Ponnamprabhakar

Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారని చెప్పారు.. ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు.

READ MORE: NKR : డైరెక్టర్ గా మారుతున్న మరో రైటర్.. కళ్యాణ్ రామ్ తో సినిమా ఫిక్స్

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మృతులకు సంతాపం వ్యక్తం చేస్తున్న.. బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి తక్షణం చర్యలు తీసుకోమని రవాణా శాఖను ఆదేశించాం. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్ ఎస్పీలతో టెలిఫోన్లో మాట్లాడడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం.. త్వరలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులం రవాణా శాఖ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేస్తాం. స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది. ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం. బస్సులపై రోజువారి రవాణా శాఖ చెక్ చేస్తే వేధింపులు అంటున్నారు.. ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగిన బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు తిరుగుతుంది..” అని టీజీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

READ MORE: Gambhir vs Rohit Sharma: ఇదే నీ వీడ్కోలు మ్యాచ్.. రోహిత్ శర్మతో గంభీర్ వ్యాఖ్యలు వైరల్!

Exit mobile version