ఏప్రిల్ 7, 8 తేదీల్లో నిజామాబాద్ జిల్లాలో కల్తీ కల్లు వల్ల 83 మంది బాధితులు ఆస్పత్రి పాలయ్యారని తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు. ఆల్ఫాజోలం కలిపినా కల్లు తాగడం వల్ల అస్వస్థత లోనయ్యారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో టీజీఎన్‌ఏబీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కల్తీ కల్లుపై తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల కోసం 26 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
డి.ఎస్.పి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో కలిపి ఒక్కో బృందం ఏర్పాటు చేశామని డైరెక్టర్ సందీప్ శాండిల్య చెప్పారు.. 26 బృందాలు నిజామాబాద్ జిల్లాలోని 104 గ్రామాలను కవర్ చేస్తాయన్నారు. ఒక్కో బృందం నాలుగు గ్రామాలను కవర్ చేస్తుందని.. అవగాహన కార్యక్రమాల్లో గ్రామాల్లోని యూత్ కూడా భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. యూత్ భాగస్వామ్యం కోసం వారికి స్పోర్ట్స్ కిట్స్ ఇస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో, కల్లు దుకాణాల వద్ద పోస్టర్లు అతికించి కల్తీ కల్లు వల్ల అనర్థాలు వివరిస్తామన్నారు. తెలంగాణలో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడానికి అందరూ సహకరించాలని కోరారు.
READ MORE: India Pakistan War: ఇండియా-పాకిస్థాన్ యుద్ధం వస్తే.. ఏయే రాష్ట్రాలు ప్రభావితమవుతాయి?
