Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణలో గత ప్రభుత్వ హయాంలో పలు భూ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. వాటిపై విచారణ కోసం తాజాగా ప్రత్యేక కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దేవసేన చైర్‌పర్సన్‌గా, రాజీవ్‌గాంధీ హనుమంతు కన్వీనర్‌గా, సందీప్ కుమార్ ఝా సభ్యుడిగా ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్వర్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన భూములపై ఈ కమిటీ విచారణ జరపనుంది. ప్రభుత్వ, అసైన్డ్, భూదాన్ భూములతో పాటు ధరణి మాడ్యూల్ దుర్వినియోగం, మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టుల భూసేకరణలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేయాలని కమిటీకి నిర్దేశించింది ప్రభుత్వం. నిర్దేశించిన జిల్లాల్లో జరిగిన ఈ భూ అక్రమాలకు బాధ్యులను గుర్తించి, చర్యలు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంది. ఐతే కమిటీ.. తన పనిని ఎక్కడి నుంచి మొదలు పెట్టబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే క్రమంలో అందరి ఫోకస్.. మాజీ సీఎం కేసీఆర్ వైపు మళ్ళింది. ఆయనకు నోటీసులు ఇస్తారా..? లేదా అన్న డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఎర్రవల్లిలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూముల సర్వే పూర్తయ్యాక.. డైరెక్ట్‌గా ఫామ్‌హౌస్ ఎపిసోడ్‌కి వెళ్ళవచ్చన్న అంచనాలున్నాయి. దానికి సంబంధించి త్వరలోనే కేసీఆర్‌కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు.
భూములకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని మొదట కోరవచ్చని అంటున్నారు. కేసీఆర్‌తో పాటు చుట్టు పక్కల ఉన్న భూముల యజమానులకు నోటీసులు ఇవ్వడం, వారి రికార్డులు అడగడంతో పాటు.. వాటి ప్రకారం సర్వే నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. రికార్డుల ప్రకారం భూముల సరిహద్దులు గుర్తించడం, ఓవర్ ల్యాపింగ్ భూమి లెక్క తేల్చే ఛాన్సే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అలాగే.. సీలింగ్ యాక్ట్ అమలు మీద కూడా ఫోకస్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. నోటీసులు ఇచ్చి.. వివరాలు సేకరించి.. భూముల లెక్క తేల్చి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతోనే ప్రభుత్వం కమిటీ వేసిందన్న ప్రచారం జరుగుతోంది. కమిటీ పని కూడా అదే యాంగిల్లో ఉండవచ్చన్నది ఓ అంచనా. సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రస్తావించిన పేర్లతో పాటు.. రెవెన్యూ మంత్రి పొంగులేటి విప్పిన ధరణి చిట్టా ప్రకారం.. చర్యలు తీసుకునే పనిలో అధికార యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తోంది. కమిటీకి తోడుగా.. ఎంపిక చేసిన భూములు ఉన్న జిల్లాల కలెక్టర్లు కూడా సభ్యులుగా ఉంటారు. ఇలా రెవెన్యూ యంత్రాంగం అంతా.. ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చడం.. ధరణి మాడ్యుల్లో లోపాలు గుర్తించడం.. బాధ్యులకు నోటీసులు ఇచ్చుకుంటూ చర్యలకు దిగడం లాంటి పనుల్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తుందని చెబుతున్నారు. లీగల్‌గా ఎక్కడా లోపాలు లేకుండా.. నిబంధనల మేరకు వ్యవహారం చక్కబెట్టలాలన్నది ప్రభుత్వ ఆలోచనగా చెబుతున్నారు. కమిటీ వేయడమంటే.. పని మొదలుపెట్టడమేనన్న ఇండికేషన్ ఇస్తోంది సర్కార్.
Also Read
తాజావార్తలు
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
-
OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!