Telangana: తెలంగాణ జూనియర్ డాక్టర్స్ సమ్మె వాయిదా.. డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడాల) రేపు నిర్వహించతలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఆ సంఘం తెలిసింది. ఇవ్వాళ సాయంత్రం జూడాలతో ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అధికారులు సానుకూల స్పందించినట్లు జూడాల పేర్కొంది. దీంతో తదుపరి నోటీసు వచ్చే వరకు సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఔట్ పేషెంట్, ఇన్ పేషెంట్, ఎమర్జెన్సీలతో సహా అన్ని వైద్య సేవలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపింది.
READ MORE: West Bengal: రణరంగంగా మారిన బెంగాల్లో ఎన్నికల ప్రచారం.. సీసాలు, రాళ్లతో దాడి
Also Read
కాగా.. తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. గత 3 నెలలుగా స్టైఫండ్ (Stifund) ఇవ్వకపోవడంతో విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. హౌస్ సర్జన్లు, జూనియర్ వైద్యులు, ఎస్ఆర్ లు ఇలా దాదాపు 10 వేల మంది వైద్య విద్యార్థులున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇంటర్న్ షిప్ చేస్తున్న హౌస్ సర్జన్లు సుమారు 2,500 మంది, దాదాపు 4 వేల మంది పీజీ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు (జూనియర్ డాక్టర్లు), మరో 2 వేల మంది సీనియర్ రెసిడెంట్లు, 1,500 మంది వరకూ సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులు ఉన్నారు. కాగా, హౌస్ సర్జన్లకు నెలకు రూ.26 వేలు, పీజీ స్పెషాలిటీ వారికి తొలి ఏడాది రూ.58 వేలు, రెండో ఏడాది రూ.61 వేలు, మూడో ఏడాది రూ.65 వేలు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు రూ.92 వేల నుంచి రూ.లక్ష వరకూ ప్రభుత్వం స్టైఫండ్ రూపంలో చెల్లిస్తోంది. అయితే, గత 3 నెలలుగా స్టైఫండ్ బకాయిలు చెల్లించలేదని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని జూనియర్ వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారులు భేటి అనంతరం సమ్మె తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
-
KCC Loan: రైతులకు గుడ్‌న్యూస్.. పంట సాగుకు డబ్బులు కావాలా? ఇలా అప్లై చేయండి!
-
CJP: AAP డూప్లికేట్‌గా CJP.? కాక్రోచ్ పార్టీ కీలక పదవుల్లో మాజీ ఆప్ నేతలు..
-
VMC: మోగిన మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్.. రేపటి నుంచే..
-
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!