IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ పోలీస్ శాఖలో భారీ ప్రక్షాళన చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఏకంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో నంబర్ 1654ను విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1995 బ్యాచ్ అధికారి మహేష్ మురళీధర్ భగవత్ నియమితులయ్యారు. ప్రస్తుతం శాంతిభద్రతల (ఎల్ అండ్ ఓ) విభాగం డీజీపీగా ఉన్న ఆయన, వీసీ సజ్జనార్ స్థానంలో నగర సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సజ్జనార్‌ను అగ్నిమాపక, విపత్తు నిర్వహణ (ఫైర్ & డిజాస్టర్ రెస్పాన్స్) డీజీగా బదిలీ చేస్తూ, ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగం డీజీపీగా డా. సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. ఆమెకు ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా బదిలీ కాగా, ఆమెకు హోంగార్డ్స్ అదనపు బాధ్యతలు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు; ఆమెకు సీఐడీ డీజీగా అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్. చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.
Also Read
- Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
- Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
- Robbery: తనిష్క్లో భారీ చోరీ.. రూ.50 కోట్ల విలువైన నగలు అపహరణ..
- KTM X-Bow Arrow: KTM నుంచి కొత్త ఆఫ్‌రోడ్ వాహనం.. 500 యూనిట్లే, ధర రూ.92.4 లక్షలు
తెలంగాణ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా డా. అనిల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న వై. నాగిరెడ్డిని సివిల్ సప్లైస్ కమిషనర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్, టీజీ-టీఎంఏఆర్ఎస్ డైరెక్టర్‌గా ఎం. స్టీఫెన్ రవీంద్ర, శాంతిభద్రతల (ఎల్ అండ్ ఓ) ఏడీజీపీగా అకున్ సభర్వాల్ నియమితులయ్యారు.
అలాగే, మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ (ఐసీసీసీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు), రైల్వేస్ ఐజీగా కే. రమేష్ నాయుడు, మల్టీ జోన్-2 డీఐజీగా నారాయణ నాయక్, జోన్-7 (జోగులాంబ) డీఐజీగా జి. చందన దీప్తి (అదనపు బాధ్యతలు) నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్‌గా డి. జోయల్ డేవిస్‌కు బాధ్యతలు అప్పగించారు.
తాజావార్తలు
-
IPS Transfers: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ.. హైదరాబాద్ కమిషనర్‌గా కొత్త బాస్..
-
TG SAFE: పెద్ద బ్రాండ్లే కదా అని సేఫ్ అనుకుంటున్నారా? డొమినోస్, కేఎఫ్‌సీ స్టోర్లలో తనిఖీలతో కలకలం!
-
Nvidia Scandal: జెన్సన్ హువాంగ్-ఆలిస్లను కలిపింది ఆమె భర్తే.. ఎన్విడియా కేసులో ట్విస్ట్..
-
Under -19 Asia Cup: ఆఫ్ఘనిస్థాన్ చిత్తు చిత్తు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్..
-
Jithu Madhavan: ఆ స్వీకెల్ ఇప్పట్లో లేనట్లేనా? తేల్చి చెప్పేసిన డైరెక్టర్!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!