Ponguleti Srinivas Reddy : ఏఐతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలకు చెక్..
- రేపటి నుంచి స్లాట్ బుకింగ్
- "స్లాట్" తో పెరిగిన రిజిస్ట్రేషన్లు
- రిజిస్ట్రేషన్ సేవల్లో ఏఐతో వాట్సప్ చాట్‌బాట్ మేధా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం తోపాటు కృత్రిమ మేధ ( ఏఐ) సేవలను ఉపయోగించుకొని ప్రజలకు మరింత సులువైన సమర్థవంతమైన సేవలను అందించబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా రెండు విడతల్లో 47 చోట్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలుచేయగా తాజాగా జూన్ 2వ తేదీ నుంచి మిగిలిన 97 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆదివారం నాడు స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ అధికారులతో మంత్రి సమీక్షించారు.
READ MORE: Sree Leela : ఎంగేజ్ మెంట్ ఫొటోలపై స్పందించిన శ్రీలీల..
Also Read
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
- IND vs AFG: డెబ్యూలోనే మానవ్ సుతార్ సంచలనం.. భారీ ఆధిక్యంలో టీమిండియా..!
- Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
- Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఆస్తుల క్రయ విక్రయదారులకు సమయం ఆదా అయ్యేలా పారదర్శకంగా అవినీతి రహితంగా మెరుగైన సేవలు అందించేందుకు చేపట్టిన స్లాట్ బుకింగ్ విధానం వల్ల తాము అనుకున్న విధంగానే సత్ఫలితాలు వచ్చాయని, 94 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. మొదటి దశలో 22 సబ్ రిజిస్టర్ కార్యాలయాలలో ఏప్రిల్ 10 నుంచి ఇప్పటివరకు 30,592 డాక్యుమెంట్లు, రెండో దశలో 25 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో మే 12 నుంచి ఇప్పటివరకు 14,099 డాక్యుమెంట్లు మొత్తం 45,191 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగాయని, స్లాట్ బుకింగ్ వల్ల మూడు వేల డాక్యుమెంట్లు ఎక్కువగా రిజిస్ట్రేషన్ జరిగాయని తెలిపారు.
READ MORE: Botsa Satyanarayana: చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.. కూటమి ప్రభుత్వం వంచనకు పాల్పడింది..!
ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలు, మనోభీష్టం మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని అమలుచేస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు. అంతిమంగా ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో స్లాట్ బుకింగ్ విధానంతో పాటు కృత్రిమ మేధ అనుసంధానంతో కూడిన చాట్‌బాట్ – మేధ 82476 23578 వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి వెల్లడించారు. ఈ నూతన ప్రక్రియ వల్ల రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి కలిగే సందేహాలు నివృత్తి అవుతాయని అంతేకాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లొకేషన్, స్లాట్ బుకింగ్ ఖాళీల వివరాలు, సమయం అందుబాటు వంటి సమాచారం లభిస్తుందన్నారు. గిప్ట్ డీడ్, సేల్ డీడ్ పై రిజిస్ట్రేషన్ ఛార్జీలు మార్కెట్ ధరలు తదితర అన్ని అంశాలపై ఈ ఏఐ చాట్‌బాట్ – మేధ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు.
READ MORE: Suchata Chuangsri: తెలంగాణ లో సోషల్ సర్వీస్ చేస్తా.. మిస్ వరల్డ్ కీలక వ్యాఖ్యలు…
అక్రమాలకు చెక్ పెట్టేలా లే అవుట్లలో డబుల్ రిజిస్ట్రేషన్ జరగకుండా, రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటి వివరాలు, పూర్తి కాని వాటి వివరాలు ఇటు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అటు బిల్డర్ లేదా డవలపర్ దగ్గర వివరాలు ఉండేలా డవలపర్ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ను త్వరలో తీసుకువస్తామని తెలిపారు. ఈ మ్యాడుల్ లో రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ల వివరాలు రెడ్ కలర్ లో కనిపిస్తాయి. స్లాట్ బుకింగ్ విధానం దృష్ట్యా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో పని భారం అధికంగా ఉన్న పఠాన్‌చెరువు, యాదగిరి గుట్ట, గండిపేట, ఇబ్రహీం పట్నం , సూర్యాపేట, జడ్చర్ల ,మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ మొత్తం తొమ్మిది చోట్ల అదనపు సబ్ రిజిస్ట్రార్‌తోపాటు సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి లంచ్ సమయాన్ని మినహాయించి సాయింత్రం 5 గంటల వరకూ స్లాట్ బుక్ చేసుకోవచ్చునని ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లు బుక్ అవుతాయన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాలలో సాయంత్రం 5 నుంచి 5.30 గంటల వరకు ఐదు వాకిన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువస్తున్న నేపథ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!