Inter Results : తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) 2023 ఇంటర్ ఫలితాలను మే రెండవ లేదా మూడవ వారంలో ప్రకటించడానికి సిద్ధంగా ఉంది. 2023 సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పరీక్షలు మార్చి 15 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించబడ్డాయి. ప్రశ్నా పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 15 వేర్వేరు శిబిరాల్లో ప్రారంభమైంది.. ఇది ఏప్రిల్ 20, 2023 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 4,82,677 ప్రథమ సంవత్సరం, 4,65,022 ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థులు సహా మొత్తం 9,47,699 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు మే 2023 చివరి వారంలో నిర్వహించే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.
Read Also: Kiran Kumar Reddy: నేను సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు చూడలేదు..
TSBIE ఆన్సర్ స్క్రిప్ట్‌ల ఆన్-స్క్రీన్ డిజిటల్ మూల్యాంకనాన్ని ప్రతిపాదించింది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆ ప్లాన్‌ను విరమించుకుంది. సాంప్రదాయిక మూల్యాంకన విధానాన్ని కొనసాగించింది. పరీక్ష ఫలితాల ప్రకటన తర్వాత, తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2023 తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్ నంబర్, ఇతర అవసరమైన వివరాలను నమోదు చేయడం ద్వారా వారి ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు.
Read Also: Snakes Inside Door Frame: ఒళ్లు గగుర్పాటు కలిగించే ఘటన.. డోర్ ఫ్రేమ్‌లో ఏకంగా 39 పాములు..