Inter Board : తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావిడి మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలను కొన్ని ప్రైవేటు కాలేజీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ఇప్పటికే 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలున్నాయి. దీంతో స్వల్ప సంఖ్యలో కాలేజీలు సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తే.. వాటికి పరీక్ష కేంద్రాలు ఇవ్వబోమని బోర్డు అధికారులు హెచ్చరించారు.
Plane Crash: మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
ఈ నేపథ్యంలోనే.. ఇంటర్ బోర్డులో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ప్రాక్టికల్ జరిగే ఎగ్జామ్ సెంటర్ లకు కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి ప్రాక్టికల్ సెంటర్ లో సీసీ కెమెరా ఏర్పాటు చేశామని, అక్రమాలు జరగకుండా, అపోహలు తొలగించడం కోసం సీసీ కెమెరా లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. థియరీ ఎగ్జామ్స్ లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయని కృష్ణ ఆదిత్య తెలిపారు. 90 శాతం సెంటర్ లలో సీసీ కెమెరా లు ఏర్పాటు చేశామని, ఎవరైనా విద్యార్థులు గైర్హాజరు అయిన సరిఅయిన కారణాలు చూపితే ప్రాక్టికల్స్ కి అనుమతి ఇస్తున్నామన్నారు. అన్ని సెంటర్ లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, కాలేజీలు సహకరిస్తున్నాయని ఆయన తెలిపారు. థియరీ ఎగ్జామ్ సమయంలో పేపర్ ఓపెన్ చేసే రూం లో, సెంటర్ ఎంట్రన్స్ లో, కారిడార్ లో, గ్రౌండ్ లో సీసీ కెమెరా లు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
CM Revavnth Reddy : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం