విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల ముద్రణ తుది దశలో ఉందని పేర్కొంది. 2025 జూన్ మొదటి వారంలోపుగా ముద్రణ పూర్తవుతుందని.. 2024-25 సంవత్సరానికి వినియోగించగా మిగిలిన పుస్తకాలను అవసరమైన చోట్ల పంపిణీ చేస్తున్నామని తెలిపింది. జూన్ మధ్య నాటికి 100% పుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని.. విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేసింది.
READ MORE: Auto Driver: వాటే ఐడియా సర్‌జీ.. ఆ చిన్న పని చేస్తూ లక్షలు సంపాదిస్తున్న ఆటో డ్రైవర్..!
కాగా.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కాలేజీలు సోమవారం తెరుచుకోనున్నాయి. ఈ ఏడాది నుంచి విద్యా సంవత్సరం సమయాల్లో ఇంటర్ బోర్డు మార్పులు తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం జూన్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండగా ఈ ఏడాది ఏప్రిల్ 1నే ప్రారంభించారు. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు తరగతులు నిర్వహించి, ఆపై వేసవి సెలవులు ఇచ్చారు. తిరిగి 2025-26 విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుంది. ఈ సంవత్సరం నుంచే కొత్తగా ఎంబైపీసీ చదివే అవకాశం విద్యార్థులకు కల్పించారు.
READ MORE: RCB Victory Parade: బెంగళూరు చేరుకున్న ఆర్సీబీ.. స్వాగతం పలికిన కర్ణాటక డిప్యూటీ సీఎం
