విద్యార్థులకు పుస్తకాల పంపిణీపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయిందని తెలిపింది. మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయిందని వెల్లడించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభం కాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి అవుతుందని స్పష్టం చేసింది.