TS Inter Hall Ticket: విద్యార్థుల మొబైల్‌లకే ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు!

  • ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు శుభవార్త
  • మొబైల్‌లకే ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు
  • వార్షిక పరీక్షలకు 9.50 లక్షల మంది విద్యార్థులు
Ts Inter Supply Results

Ts Inter Supply Results

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల మొబైల్‌లకే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు రానున్నాయి. విద్యార్థులు ఇచ్చిన మొబైల్‌ ఫోన్‌ నంబర్లకు ఇంటర్‌ బోర్డు అధికారులు లింక్‌ పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్‌ చేస్తే హాల్‌టికెట్‌ వస్తుందని, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. గతంలో కళాశాలలకే హాల్‌టికెట్లను పంపేవారు. విద్యార్థులు తమ తమ కళాశాలలకు వెళ్లి హాల్‌టికెట్లను తీసుకునేవారు.

నేటి (జనవరి 30) నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సర విద్యార్థులకు ఇంటర్నల్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే విద్యార్థుల మొబైల్‌లకు పంపించామని ఇంటర్‌ బోర్డు అధికారి తెలిపారు. రెండవ సంవత్సర విద్యార్థులకు ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్‌ ఉన్నాయని, త్వరలో హాల్‌టికెట్లను పంపిస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 9.50 లక్షల మంది విద్యార్థులు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వార్షిక పరీక్షలకు హాజరుకానున్నారు.