Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahabubabad: పూర్వకాలంలో సతీ సావిత్రి తన భర్త సత్యవంతుడి ప్రాణాలను కాపాడుకోవడానికి సాక్షాత్తు యమధర్మరాజుతోనే పోరాడి, తన పాతివ్రత్య మహిమతో, చాతుర్యంతో భర్త ప్రాణాలను దక్కించుకుని ఆదర్శంగా నిలిచింది. కానీ నేటి ఆధునిక కాలంలో ఆ పవిత్రమైన దాంపత్య బంధానికి అర్థం లేకుండా పోతోంది. భార్యాభర్తల బంధంలో విశ్వాసానికి బదులు వంచన, ప్రేమకు బదులు స్వార్థం రాజ్యమేలుతున్నాయి. సతీ సావిత్రి కథకు పూర్తి విరుద్ధంగా, కట్టుకున్న భర్త ప్రాణాలను కాపాడాల్సింది పోయి, ప్రియుడితో కలిసి భర్తనే కడతేర్చడానికి ప్లాన్లు వేసిన దారుణ సంఘటనలు సమాజంలో నిత్యం వెలుగు చూస్తున్నాయి.
అలాంటి ఘటనే మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసి తీవ్ర కలకలం రేపింది. డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్ నగర్లో నివాసముంటున్నాడు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన యువతితో అతనికి వివాహం కాగా, ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జూలై నెల 27వ తేదీన భోజనం కోసం ఇంటికి వెళ్లిన రాజేశ్వరరావు తన భార్య మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ విషయంపై పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు తన అన్నను తీసుకురావడానికి వెళ్లిన సమయంలో అనుమానితుడు తనను వెంబడించినట్లు తెలిపాడు. అనంతరం భార్య మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా ప్రియుడితో జరిగిన చాటింగ్ బయటపడినట్లు పేర్కొన్నాడు. భర్తను ఎలాగైనా హత్య చేయించాలని భార్య ప్రియుడితో చేసిన ఛాటింగ్‌లో కనిపించింది. రోడ్డు ప్రమాదం చేయించి చంపేయాలని భార్య కుట్ర పన్నింది. ఈ విషయంలో ప్రియుడిపై ఒత్తిడి చేసినట్లు మెసేజ్‌లలో కనిపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని పేర్కొంటూ భార్యతో పాటు ఆమె ప్రియుడు పురిమెట్ల సైదులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ భర్త ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా డోర్నకల్లు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఖమ్మం గ్రామీణ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అనంతరం బాధితుడు అక్కడ కూడా మరోసారి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందిందని, చట్టపరమైన విచారణ చేపట్టి అవసరమైన చర్యలు తీసుకుంటామని గ్రామీణ పోలీసులు తెలిపారు. కేసులో సమర్పించిన డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తూ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Also Read
- Ajinkya Rahane: "ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే".. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
- Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
- Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
- KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
తాజావార్తలు
-
Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
-
Ajinkya Rahane: “ధోనీ, కోహ్లీ కానే కాదు.. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ అతడే”.. రహానే ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Salman Khan: అస్సాం వరద బాధితులకు అండగా సల్మాన్ ఖాన్.. 500 కొత్త ఇళ్ల నిర్మాణానికి సహాయం
-
Deepika Padukone: ‘రాకా’.. హీరోయిన్ దీపికా పదుకొనే పనైపోయినట్టే, ఇక అవుట్!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!